నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో జీవవైవిధ్య పరిరక్షణ, ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్‌కు ఒక సంవత్సరం పూర్తి..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 6, 2025: యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ (UWH,HSBC గ్లోబల్ సర్వీస్ సెంటర్స్ ఇండియా భాగస్వామ్యంలో హైదరాబాద్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 6, 2025: యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ (UWH,HSBC గ్లోబల్ సర్వీస్ సెంటర్స్ ఇండియా భాగస్వామ్యంలో హైదరాబాద్ బహదూర్‌పురాలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రారంభించిన జీవవైవిధ్య పరిరక్షణ, ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్‌కి ఈ రోజు ఒక సంవత్సరం పూర్తయింది. ఈ జూ పార్క్ తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది.హైదరాబాద్‌లో అత్యధికంగా సందర్శించబడే ప్రదేశాలలో ఒకటి.
ఈ ప్రాజెక్ట్ 2024 నవంబరులో ప్రారంభమైంది. దీని ద్వారా జూ లో పునరుత్పాదక ఇంధన,స్వచ్ఛ మొబిలిటీ పరిష్కారాల్లో గణనీయమైన పురోగతి సాధించనుంది. గత కొన్ని నెలలుగా, జూ సిబ్బంది.సందర్శకుల రవాణాకు 13 EV బైక్‌లు, ఇతర సిబ్బందికి 6 EV బైక్‌లు, సందర్శకుల కోసం 6 బ్యాటరీ బగ్గీలు అందించాయి. పార్క్‌లో వివిధ ప్రదేశాలలో 80 సౌర వీధి దీపాలు ఏర్పాటు చేశాయి. ఈ చర్యలు నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలిపాయి.
ఇది కూడా చదవండి…ఉత్పత్తి వ్యయం పెరిగింది – ధర సవరణకు అనుమతి కోరిన మద్యం సంస్థలు
ReadThis also…Godrej Properties Reports Record-Breaking FY25 with Highest Ever Bookings, Collections, and Deliveries
ReadThis also…CPA Australia Survey Highlights Strong Growth and Optimism in India’s Small Business Sector
ఈ సందర్భంగా జరిగిన హ్యాండోవర్ కార్యక్రమంలో HSBC గ్లోబల్ సర్వీస్ సెంటర్స్ హెడ్ మిస్టర్ పాల్ రాడన్, ఇతర ప్రాజెక్ట్ భాగస్వాములు పాల్గొన్నారు. వారు ఈ ప్రాజెక్ట్ సుస్థిరతపై మంచి అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ CEO శ్రీమతి రేఖా శ్రీనివాసన్ మాట్లాడుతూ, “ఈ కార్యక్రమం జూ కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంలో ఇప్పటికే కొంతమేర ప్రభావం చూపిస్తోంది. మేము కొత్త పరిష్కారాలను అమలు చేస్తున్నందున, జీవవైవిధ్య పరిరక్షణతో పాటు సందర్శకుల్లో పర్యావరణ బాధ్యతను కూడా పెంచుతున్నాం” అని అన్నారు.
HSBC గ్లోబల్ సర్వీస్ సెంటర్స్ ఇండియా హెడ్ మిసెస్ మమత మాదిరెడ్డి మాట్లాడుతూ, “నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో పునరుత్పాదక ఇంధన, స్వచ్ఛ మొబిలిటీ పరిష్కారాలు వ్యాపారాలు, సమాజాలు, భూమి కోసం ఉజ్వల భవిష్యత్తు సాధించడంలో సహాయపడతాయి. ఇది శుభ్రమైన పర్యావరణం కోసం మరో కీలక అడుగు” అన్నారు.
డా. సునీల్ హిరేమత్ (IFS), డైరెక్టర్, నెహ్రూ జూలాజికల్ పార్క్ మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ జూ వనరుల నిర్వహణ, పరిశోధన,అవగాహన కార్యక్రమాలకు నిధులు సమీకరించడంలో సహాయపడుతుంది. UWH,NZP మధ్య జరిగిన అవగాహన ఒప్పందం దీర్ఘకాలిక సుస్థిరతకు బలమైన నిబద్ధతను చూపుతోంది” అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సౌర శక్తి వ్యవస్థలను, విద్యుత్ మొబిలిటీ సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. జూ టూర్‌లో పాల్గొని సుస్థిర జూ నిర్వహణ అంశాలపై చర్చించారు.
రెండో సంవత్సరంలో మరిన్ని EV పరిష్కారాలు (వన్యప్రాణి అంబులెన్స్, రెస్క్యూ వ్యాన్), సౌర ఫెన్సింగ్, 60-కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలపై దృష్టి పెట్టబడనుంది, తద్వారా నెహ్రూ జూలాజికల్ పార్క్ మరింత పర్యావరణ-హితమైన ప్రథమంగా నిలుస్తుంది.