పిఠాపురంలో కొత్త రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ నాగబాబు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పిఠాపురం, ఏప్రిల్ 5,2025:పిఠాపురం నియోజకవర్గంలోని పల్లె ప్రజలకు రహదారి సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పిఠాపురం, ఏప్రిల్ 5,2025:పిఠాపురం నియోజకవర్గంలోని పల్లె ప్రజలకు రహదారి సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌జీఆర్ఈజీఎస్) ద్వారా నిర్మించిన పలు గ్రామీణ రహదారులను శనివారం శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి..బరువు తగ్గడానికి సహజ మార్గం: ది గుడ్ బగ్ నుంచి జీఎల్‌పీ-1 ఆధారిత విప్లవాత్మక సొల్యూషన్..
ఇది కూడా చదవండి..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ “పెద్ది” ఫస్ట్ షాట్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ షురూ..
Read this also…Mixing Complete & Time Locked: Ram Charan’s “First Shot” from Peddi Drops April 6..
పిఠాపురం మండలం కుమారపురం హౌసింగ్ లే అవుట్-1లో రూ.15.70 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన తారు రహదారిని ప్రజలకు అంకితం చేశారు. ఈ రహదారి విరవ నుంచి కోలంక, గోకివాడ గ్రామాల మధ్య ముఖ్య రవాణా మార్గంగా ఉపయోగపడనుంది.

ఈ సందర్భంగా రహదారి నాణ్యతను పరిశీలించిన నాగబాబు మాట్లాడుతూ… ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, కడా ఛైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, ఇతర నేతలు పాల్గొన్నారు.