మెగాస్టార్ చిరంజీవి కి యు.కె పార్లమెంట్ లో సన్మానం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 14,2025: అగ్ర కథానాయకుడు మెగాస్టార్ డా. చిరంజీవి కొణిదల గారికి కి హౌస్ ఆఫ్ కామన్స్ – యు.కె పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరగనున్నది.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 14,2025: అగ్ర కథానాయకుడు మెగాస్టార్ డా. చిరంజీవి కొణిదల గారికి కి హౌస్ ఆఫ్ కామన్స్ – యు.కె పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరగనున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ, యుకె కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న సన్మానించనున్నారు.
Read this also…UK Parliament to honourMegastar Chiranjeevi Konidela
Read this also…CARE Ratings Upgrades Waaree Renewable Technologies Limited (WRTL) to ‘A’ with Stable Outlook
సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.

బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యు.కె లో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంతుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి గారు అందుకోనుండటం విశేషం. ఇది ఆయన కీర్తి కీరటంలో మరో కలికితురాయిగా నిలుస్తుంది.
ఇది కూడా చదవండి…సీఎం చంద్రబాబుతో సీనియర్ నేత నాగం భేటీ
యు.కె కు చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీ గారిని సన్మానించటం, ఆయనకు లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డ్ ఇవ్వటం అనేది ప్రత్యేకమైన సందర్భం.

2024లో భారత ప్రభుత్వం నుంచి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను చిరంజీవి గారు అందుకున్నారు. అలాగే గత ఏడాది అత్యంత సమర్ధవంతమైన నటుడు, డ్యాన్సర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో సత్కరించబడ్డారు. ఎ.ఎన్.ఆర్ శత జయంతి సందర్భంగా, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది.