మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్య పరీక్షలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 9,2025: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య సమస్యలతో సింగపూర్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 9,2025: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య సమస్యలతో సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వాయువీగ్య ప్రాశనం వల్ల ఊపిరితిత్తులకు ప్రభావం చూపడంతో పాటు చేతులు, కాళ్లకు గాయాలైనట్టు సమాచారం. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు చేరుకున్న పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి తన కుమారుని పరామర్శించారు.

ఆసుపత్రి వర్గాల వెల్లడించిన వివరాల ప్రకారం… మార్క్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, ఊపిరితిత్తులకు సంభవించిన నష్టం వల్ల తలెత్తే సమస్యలపై వైద్యులు పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) అత్యవసర చికిత్స విభాగం నుంచి సాధారణ గదికి మార్చినట్టు సమాచారం. మరో మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగనున్నాయని తెలిపారు.