‘జగన్నాథ్’ మూవీ టీజర్ లాంచ్ చేసిన మంచు మనోజ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 15,2025: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ‘జగన్నాథ్’ మూవీ టీజర్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. భరత్ ఫిలిం ఫ్యాక్టరీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 15,2025: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ‘జగన్నాథ్’ మూవీ టీజర్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. భరత్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై భరత్, సంతోష్ దర్శకత్వంలో, పీలం పురుషోత్తం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాయలసీమ భరత్, ప్రీతి జంటగా నటిస్తున్నారు.
ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ నటుడు, రాక్‌స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా పాల్గొని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కామెడియన్స్ అప్పారావు, వినోదిని, గడ్డం నవీన్ తమ హాస్యంతో సందడి చేశారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ, ‘‘జగన్నాథ్’ టీజర్ చాలా అద్భుతంగా ఉంది. రాయలసీమ భరత్ తన తొలి సినిమానే ఎంతో ప్రొఫెషనల్‌గా చేశాడు. చిత్ర బృందం ఎంతో శ్రమించింది. సినిమా తీయడం చిన్న విషయం కాదు. కానీ వారు ఎంతో ప్రేమ, పట్టుదలతో ఈ సినిమాను రూపొందించారు.

బడ్జెట్ ఎంత ఉన్నా, సినిమా మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. ‘జగన్నాథ్’ పెద్ద హిట్ కావాలి’’ అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
హీరో రాయలసీమ భరత్ మాట్లాడుతూ, ‘‘మంచు మనోజ్ అన్న గొప్ప మనసున్న వ్యక్తి. స్వచ్ఛందంగా ఈ వేడుకకు విచ్చేసి మాకు మద్దతుగా నిలిచారు. సినిమా పై ఉన్న ప్రేమతో, ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాల పాటు శ్రమించి ఈ సినిమాను పూర్తిచేశాను.
ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన వెంకీ, చైతూ, కదిరి భాషలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ‘జగన్నాథ్’ ప్రేక్షకులందరికీ నచ్చేలా రూపొందించాం’’ అని తెలిపారు.
Read this also.. Manchu Manoj Unveils the Teaser of ‘Jagannath’ in a Grand Event
ఇది కూడా చదవండి.. రామ్ మధ్వాని ‘ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్’ టీజర్ విడుదల
ఇది కూడా చదవండి.. అరుల్మిగు సోలైమలై మురుగన్ సేవలో పవన్ కళ్యాణ్
ఇది కూడా చదవండి..ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌సిసిబి సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి
‘జగన్నాథ్’ మూవీ – నటీనటులు, సాంకేతిక బృందం
తారాగణం:
రాయలసీమ భరత్ (హీరో)
ప్రీతి రెడ్డి, సారా, నిత్యశ్రీ, ఇతరులు
సాంకేతిక బృందం:
దర్శకత్వం: భరత్, సంతోష్
నిర్మాత: పీలం పురుషోత్తం

సహనిర్మాతలు:
మదినే దుర్గారావు
బుక్కే వేను మాధవి
బుట్టమనేని వెంకటేష్
నాగ చైతన్య రాయల్స్
కార్యనిర్వాహక నిర్మాతలు:
మదన్ అర్జున్
రామ
డోలీ అనిల్
కింగ్ జగపతి రాజు
సంగీతం & బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: శేఖర్ మొపూరి
కథ & మాటలు: నందమూరి హరి, ఎన్టీఆర్
డైలాగ్స్ & స్క్రీన్‌ప్లే: శివక్ వాలి, క్రాంతి కుమార్ కొండెల
వీఎఫ్ఎక్స్ & డీఐ: జెమినీ ల్యాబ్
పోస్ట్ ప్రొడక్షన్: సూపర్ గుడ్ స్టూడియో
సౌండ్ డిజైనింగ్ & మిక్సింగ్: శ్యామల్ సిద్ధార్
పీఆర్వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్