మహీంద్రా సార్థి అభియాన్: ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు 1,000 స్కాలర్‌షిప్‌లు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 17, 2024: మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (MTBD), మహీంద్రా గ్రూప్‌లో భాగంగా,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 17, 2024: మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (MTBD), మహీంద్రా గ్రూప్‌లో భాగంగా, డ్రైవర్స్ డే 2024 సందర్భంగా ట్రక్ డ్రైవర్ల కుమార్తెల కోసం మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది.

ఈ ప్రాజెక్టు ద్వారా మహీంద్రా, ట్రక్ డ్రైవర్ల ప్రతిభావంతులైన కుమార్తెలకు పై చదువులు చదవడానికి మద్దతు ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో కొంత మార్పు తీసుకురావాలని సంకల్పించింది.

మహీంద్రా ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి కమర్షియల్ వాహన తయారీ సంస్థగా పేరు పొందింది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 10,000 స్కాలర్‌షిప్‌తో పాటు సర్టిఫికెట్ అందజేస్తుంది. 2014లో ప్రారంభమైన ఈ సార్థి అభియాన్ ద్వారా ట్రక్ డ్రైవర్ సమాజానికి మద్దతు అందించడంలో మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ చేస్తున్న కృషిలో ఇది మరొక మైలురాయి.

ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 75 పైగా ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లలో నిర్వహించనుంది. ఇప్పటివరకు 10,029 మంది యువతులు ఈ స్కాలర్‌షిప్ ద్వారా ప్రయోజనం పొందారు.

ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్ (ట్రక్స్, బసెస్, సీఈ, ఏరోస్పేస్ & డిఫెన్స్ బిజినెసెస్)మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు Mr. వినోద్ సహాయ్ మాట్లాడుతూ, “మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా మేము కేవలం స్కాలర్‌షిప్‌లను మాత్రమే అందించడం కాకుండా, యువతుల్లో ఆశలు నింపి వారి భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తున్నాం.

ట్రక్ డ్రైవర్ భాగస్వాముల కుమార్తెలకు చదువుకునే అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో వారు సగర్వంగా ఎదగడానికి సహకరిస్తున్నాం. వారి భవిష్యత్తుపై పెట్టుబడి వేయడం ద్వారా మహిళలను సాధికారత కలిగించడంలో దోహదపడుతున్నాం” అన్నారు.

ఇక మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కమర్షియల్ వెహికల్స్ బిజినెస్ హెడ్ Mr. జలజ్ గుప్తా మాట్లాడుతూ, “మహీంద్రా సార్థి అభియాన్ మా దీర్ఘకాల మద్దతు కేవలం ట్రక్ డ్రైవర్ల కుమార్తెల జీవితాలను మెరుగుపర్చడానికి మాత్రమే కాకుండా వారికి కొత్త అవకాశాలు ప్రేరణను అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా వాణిజ్య వాహన రంగంలో మరిన్ని మహిళలను చూడాలని కోరుకుంటున్నాం” అన్నారు.

ఈ స్కాలర్‌షిప్‌లను ఎంపికైన ప్రతి విద్యార్థిని బ్యాంక్ ఖాతాలోకి నేరుగా రూ. 10,000 అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసి, సర్టిఫికెట్ అందజేయనున్నారు. 2025 ఫిబ్రవరి నుండి మార్చి వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మహీంద్రా ట్రక్ అండ్ బస్ నాయకత్వం ఆధ్వర్యంలో 1,000 స్కాలర్‌షిప్‌లు అందజేయబడతాయి.

About Author