మాజిల్లానిక్ క్లౌడ్ టెక్నాలజీ విస్తరణ.. తెలంగాణలో భారీ పెట్టుబడులు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 17, 2025: దేశీయంగా టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తున్న మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ (NSE & BSE: MCLOUD) తన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 17, 2025: దేశీయంగా టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తున్న మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ (NSE & BSE: MCLOUD) తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తూ, దీర్ఘకాలిక వృద్ధికి ఏఐ ఆధారిత పరిష్కారాలను ప్రధానంగా అభివృద్ధి చేస్తోంది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ఇటీవల లిస్టయిన అనంతరం, కంపెనీ తదుపరి దశ వృద్ధిని వేగవంతం చేయడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Read this also...Magellanic Cloud Accelerates AI-Led Growth, Expands Operations in Telangana

Read this also...The Habitats Trust Grant Opens Applications for 8th Edition, Offering Over Rs.3.5 Crore in Conservation Funding

ఇది కూడా చదవండి.ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు భక్తుల నుంచి రూ.20 లక్షల విరాళం

Read this also...Devotees Contribute ₹20 Lakh to SV Annaprasadam Trust

మాజిల్లానిక్ క్లౌడ్ ప్రస్తుతం ఈ-సర్వైలెన్స్, వీడియో అనలిటిక్స్ (Scanalitix), డీప్-టెక్ పరిష్కారాలు వంటి కీలక విభాగాల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. అంతేకాదు, భారతదేశంలో వాణిజ్య అవసరాలకు అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన కార్గో డ్రోన్ ‘CargoMax 200KHC’ ను ఇటీవల ఆవిష్కరించింది. ఇది 200 కేజీల పేలోడ్ మోయగల సామర్థ్యం కలిగిఉంది.

మాజిల్లానిక్ క్లౌడ్, BFSI, టెలికం, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాలకు అనువుగా మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జెనరేటివ్ ఏఐ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది. అలాగే, కంపెనీ వ్యూహాత్మక కొనుగోళ్లు (Strategic Acquisitions) ద్వారా విస్తరణపై దృష్టి సారించింది.

మాజిల్లానిక్ క్లౌడ్ అనుబంధ సంస్థ iVIS, ఆధునాతన సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టనుంది. “భవిష్యత్తులో సెక్యూరిటీ రంగం ఏఐ, సర్వైలెన్స్ కలయికతో రూపుదిద్దుకోనుంది.

తెలంగాణలోని మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా అభివృద్ధి చేసే వీడియో అనలిటిక్స్ సిస్టమ్లు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు విలువైన డేటా ఇన్సైట్స్ అందించనున్నాయి” అని మాజిల్లానిక్ క్లౌడ్ మేనేజింగ్ డైరెక్టర్ & గ్లోబల్ సీఈవో జోసెఫ్ సుధీర్ తుమ్మ తెలిపారు.

ఇది కూడా చదవండి..₹2,000 కోట్ల ఐపీవో కోసం సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన ఇన్నోవేటివ్యూ ఇండియా లిమిటెడ్

Read this also...Innovatiview India Limited Files DRHP with SEBI to Raise up toRs.2000 Crore via IPO

మాజిల్లానిక్ క్లౌడ్ అనుబంధ సంస్థ Scandron తన డీప్‌టెక్, డ్రోన్ తయారీ వ్యాపారాన్ని విస్తరిస్తూ కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోంది. గత రెండేళ్లలో కంపెనీ 17+ వినూత్న డ్రోన్ ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. “ఏరియల్ లాజిస్టిక్స్ విభాగంలో కొత్త సామర్థ్యాలు, అధునాతన పరిష్కారాలను అందించడమే మా లక్ష్యం” అని Scandron CEO అర్జున్ నాయక్ తెలిపారు.

తెలంగాణలో భారీ పెట్టుబడులు

మాజిల్లానిక్ క్లౌడ్ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరిస్తూ, ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పాటునిస్తూ అంతర్జాతీయ మార్కెట్లలో తన స్థాయిని పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. “తెలంగాణలో పురోగామి విధానాలు, ప్రతిభావంతుల లభ్యత కంపెనీ అభివృద్ధికి సహాయపడుతున్నాయి” అని జోసెఫ్ సుధీర్ తుమ్మ అన్నారు.

ప్రస్తుతం మాజిల్లానిక్ క్లౌడ్ 1600+ ప్రొఫెషనల్స్‌తో ఫార్చూన్ 1000 కంపెనీలకు సేవలందిస్తోంది. టెక్నాలజీ రంగంలో తన ప్రభావాన్ని పెంచుకునే క్రమంలో, దేశీయంగా, అంతర్జాతీయంగా మరింత విస్తరించేందుకు కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తోంది.

About Author