శ్రీకాళహస్తి-హైదరాబాద్ 600 కి.మీ. సైక్లింగ్‌కు మధురి గోల్డ్ బ్యాకప్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 25,2025: భారత ఆభరణ రంగంలో ఒక కొత్త చరిత్ర సృష్టించబోతోంది మధురి గోల్డ్. మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2024-25

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 25,2025: భారత ఆభరణ రంగంలో ఒక కొత్త చరిత్ర సృష్టించబోతోంది మధురి గోల్డ్. మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2024-25 చందన జయరాంతో జతకట్టి శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ వరకు 600 కిలోమీటర్ల భారీ సైక్లింగ్ యాత్రను ప్రారంభించనుంది. దేశంలోనే తొలిసారిగా ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రధాన ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ కార్యక్రమంలో భాగస్వామి కావడం ఇదే!

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ యాత్రకు జెండా ఊపి ప్రారంభిస్తారు. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మద్దతుతో గెలిచిన ఆయన నాయకత్వంలో ఈ యాత్ర బలం, ఐక్యత, లక్ష్యసాధనకు ప్రతీకగా నిలుస్తుందని మధురి గోల్డ్ తెలిపింది.

చందన జయరాం… గ్రామం నుంచి గ్లోబల్ స్టేజ్ వరకు చిన్న గ్రామం నుంచి వచ్చిన చందన… ఫ్యాషన్ మోడల్, కంటెంట్ క్రియేటర్, అథ్లెట్, సైక్లిస్ట్. 2020లో ఫిట్‌నెస్ ప్రయాణం మొదలుపెట్టి కేవలం 10 నెలల్లో 20 కేజీలు తగ్గి, తనను తాను మార్చుకున్నారు.

“ఫిట్‌నెస్ శరీరాన్ని మాత్రమే కాదు… మైండ్‌సెట్‌ను కూడా మారుస్తుంది. ఇది నాకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, మానసిక బలం ఇచ్చింది” అంటారు చందన.

త్రిచి BRM (అంతర్జాతీయ ఎండ్యూరెన్స్ సైక్లింగ్ ఛాలెంజ్) విజయవంతంగా పూర్తి చేసిన ఆమె… ఇప్పుడు 600 కి.మీ. రైడ్‌తో మరో సంచలనం సృష్టించనుంది.

మధురి గోల్డ్ ఏమంటోంది? సంస్థ తరఫున సునీల్ గారు: “చందన ధైర్యం, సొగసు, పట్టుదల… మధురి గోల్డ్ విలువలైన పవిత్రత, సంకల్పం, అభివృద్ధిని ప్రతిబింబిస్తాయి. ఈ యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా మహిళలు తమ కలలను సాధించేందుకు, అడ్డంకులు దాటేందుకు, ఆత్మవిశ్వాసంతో మెరవడానికి ప్రేరణ పొందాలని కోరుకుంటున్నాం.”

సీఎంఓ & నాలుగు సార్లు నేషనల్ ఆఫ్-రోడ్ బైకింగ్ ఛాంపియన్ విశ్వాస్ గారు: “గ్రామీణ స్థాయి ప్రతిభను కనుగొని ప్రోత్సహించడమే మా విజన్. ఈ రైడ్ శ్రమ, సంకల్పం, పెద్ద కలలకు ధైర్యానికి చిహ్నం. మహిళలు ఫిట్‌నెస్‌ను, ఆత్మవిశ్వాసాన్ని జీవనశైలిగా మార్చుకోవాలని ఆశిస్తున్నాం.”

కాలతూరు వరద బాధితులకు మధురి గోల్డ్ చేయూత ఇటీవల కాలతూరు ప్రాంతంలో వచ్చిన వరదలతో బాధపడుతున్న కుటుంబాలకు మధురి గోల్డ్ యాజమాన్యం స్వయంగా ముందుకు వచ్చింది. ఆహారం, అవసర సామగ్రి, ఉపశమన వస్తువులు అందజేస్తూ… వ్యాపార సంస్థ కాదు, సమాజానికి అండగా నిలిచే కుటుంబంగా మారింది.

అందం, బలం, సంకల్పం… మూడూ ఒకేచోట కలిసే ఈ అద్భుత యాత్రకు మధురి గోల్డ్, చందన జయరాం సిద్ధమయ్యారు.

About Author