టిగ్మాన్షు ధులియా, మయూర్ మోర్ నటించిన ‘బ్లాక్, వైట్ అండ్ గ్రే – లవ్ కిల్స్’ ట్రైలర్ విడుదల..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 16,2025: సోనీ లివ్‌లో డాక్యుమెంట్-డ్రామాగా ‘బ్లాక్ వైట్ & గ్రే – లవ్ కిల్స్’ నుంచి అద్భుతమైన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లోని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 16,2025: సోనీ లివ్‌లో డాక్యుమెంట్-డ్రామాగా ‘బ్లాక్ వైట్ & గ్రే – లవ్ కిల్స్’ నుంచి అద్భుతమైన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లోని విషయాన్ని చెప్పేలా, ఉండే సంక్లిష్టమైన, ఆలోచించపజేసేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం, వాటి నుంచి తప్పించుకునే యువకుడు, అతడితో ముడిపడి ఉన్న హత్యలు, వాటి వెనుకున్న రహస్యాల్ని ఛేదించే జర్నలిస్ట్ డేనియల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. డేనియల్ దర్యాప్తు ఈ సిరీస్‌లో ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ట్రైలర్ ప్రస్తుతం సిరీస్ మీద అంచనాల్ని పెంచేస్తోంది.
Read this also…“Love, Lies, and Betrayal: Sony LIV Reveals Trailer for ‘Black, White & Gray – Love Kills,’ Premiering Worldwide on May 2”
ఇది కూడా చదవండి..ఫాస్ట్ గోల్డ్ లోన్ సేవలను ప్రారంభించిన పూనావాలా ఫిన్‌కార్ప్
మయూర్ మోర్ మాట్లాడుతూ.. ‘బ్లాక్, వైట్ అండ్ గ్రే – లవ్ కిల్స్ ప్రాజెక్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. ఇది ఒక బోల్డ్, జానర్-బెండింగ్ డాక్యుమెంటరీ. క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ జానర్‌లో ఇది ది బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ కథ అపరాధం, అమాయకత్వం, న్యాయం వంటి వాటిపై అవగాహన కల్పించి..

ప్రశ్నించేలా చేస్తుంది. నా పాత్ర చాలా బాగా వచ్చింది. ఆడియెన్స్ అంతా కూడా ఈ కథకు కనెక్ట్ అవుతారు. ఇది మిమ్మల్ని చాలా కాలం వెంటాడుతుంది’ అని అన్నారు.
పుష్కర్ సునీల్ మహాబల్మ్ దర్శకత్వం వహించిన బ్లాక్, వైట్ & గ్రే – లవ్ కిల్స్‌ను స్వరూప్ సంపత్, హేమల్ ఎ. ఠక్కర్ నిర్మించారు. టిగ్మాన్షు ధులియాతో పాటు, ఈ సిరీస్‌లో మయూర్ మోర్, పాలక్ జైస్వాల్, దేవేన్ భోజని, ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్, హక్కిమ్ షాజహాన్, అనంత్ జోగ్, కమలేష్ సావంత్ తదితరులు నటించారు.
Read this also…Poonawalla Fincorp Forays into Gold Loan Business to Strengthen Secured Lending Portfolio
Read this also…Axis Mutual Fund Joins ONDC Network to Broaden Access to Mutual Fund Investments
ట్రైలర్ లింక్: https://www.youtube.com/watch?v=RXGTTWs544Y
మే 2 నుంచి సోనీ LIVలో ప్రత్యేకంగా బ్లాక్, వైట్ & గ్రే – లవ్ కిల్స్ స్ట్రీమింగ్ కానుంది.