శాసనసభలో నవ్వులు.. సాంస్కృతిక విహారం లో సందడి!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ,మార్చి 20,2025:శాసనసభలో గతంలో చోటుచేసుకున్న అపశబ్దాల స్థానంలో సోదరభావం, సుహృద్భావ వాతావరణం నెలకొనడం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ,మార్చి 20,2025:శాసనసభలో గతంలో చోటుచేసుకున్న అపశబ్దాల స్థానంలో సోదరభావం, సుహృద్భావ వాతావరణం నెలకొనడం శుభసంకేతమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సెషన్ ముగింపు సందర్భంగా రెండు రోజుల పాటు జరిగిన క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభను కనబర్చారు.

గురువారం సాయంత్రం విజయవాడలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రదర్శించిన వినోదాత్మక స్కిట్లు, ఏకపాత్రాభినయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల కామెడీ స్కిట్లు చూసిన తర్వాత “గబ్బర్ సింగ్” సినిమా పోలీస్ స్టేషన్ సీన్ గుర్తుకువచ్చిందని పవన్ కల్యాణ్ చమత్కరించారు.

ఇది కూడా చదవండిభారతదేశంలో తొలిసారి… తల్లులు, పిల్లల కోసం ప్రత్యేకమైన ఫ్యాషన్ ఈవెంట్

Read this also…72nd Miss World Festival to be Hosted in Telangana, Uniting 140 Nations

చంద్రబాబుకు మరిచిపోలేని నవ్వుల విందు
సాధారణంగా పాలనపై చిత్తశుద్ధిగా ఆలోచించే చంద్రబాబు నాయుడు గంభీరంగా ఉండే వ్యక్తి. కానీ ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల ప్రదర్శన చూసి ఆయన తనివితీరా నవ్వారని పవన్ కల్యాణ్ తెలిపారు. “తన మీద రాష్ట్ర బాధ్యతల ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ విధంగా ఓపిగా నవ్వడం చాలాకాలం తర్వాత చూశాను” అని ఆయన అన్నారు.

క్రీడల పట్ల ఆసక్తి.. వచ్చే ఏడాది నేను కూడా పోటీకి!
క్రీడలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది జరిగే పోటీల్లో తాను కూడా ఏదైనా విభాగంలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ పోటీలు సభ్యుల మధ్య ఐక్యతను పెంచి, సమష్టిగా ముందుకు సాగే తత్వాన్ని అలవర్చుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అభినందనల జల్లు
ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు సభాపతి అయ్యన్న పాత్రుడికి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా, ధుర్యోధనుడిగా ఏకపాత్రాభినయం చేసిన ఉప సభాపతి రఘరామ కృష్ణం రాజుకు, బాలచంద్రుడిగా మెప్పించిన ఎమ్మెల్యే దుర్గేష్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Read this also…TCS and Air New Zealand Join Forces for AI-Led Transformation and Enhanced Passenger Experience

ఇది కూడా చదవండి‘L2E: ఎంపురాన్’ మార్చి 27న ఐమ్యాక్స్‌లో గ్రాండ్ రిలీజ్!

“రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు గతంలో మాదిరిగానే మనం ఐక్యంగా ముందుకు సాగాలి” అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. “ఈ ఉత్సాహం, ఈ ఐక్యత ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఆయన అన్నారు.

About Author