మార్చి 27న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ‘L2 ఎంపురాన్’
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 16,2025: కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘L2 ఎంపురాన్’ ప్రపంచవ్యాప్తంగా మార్చి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 16,2025: కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘L2 ఎంపురాన్’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 27న భారీ ఎత్తున విడుదల కానుంది. ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది.
మురళి గోపి అందించిన కథకు లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మోహన్‌లాల్ ఖురేషి-అబ్రహం అలియాస్ స్టీఫెన్ నేడుంపల్లిగా ఆకట్టుకోనున్నారు.
Read this also…How Much Gold Can You Keep at Home? Tax Details Explained!
Read this also…Toyota Fortuner with ₹5 Lakh Down Payment – EMI & Finance Details
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో షూటింగ్
2023 అక్టోబర్ 5న ఫరీదాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, సిమ్లా, లేహ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముంబై, కేరళ తదితర ప్రదేశాల్లో సాగింది. హై-ఎండ్ టెక్నాలజీతో 1:2.8 అనమోర్ఫిక్ ఫార్మాట్‌లో చిత్రీకరించారు.
సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ అఖిలేష్ మోహన్, ఆర్ట్ డైరెక్టర్ మోహన్‌దాస్, స్టంట్ డైరెక్టర్ స్టంట్ సిల్వా, క్రియేటివ్ డైరెక్టర్ నిర్మల్ సహదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ దీపక్ దేవ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.
Read this also…Amaravati Capital City Works to Resume in April; PM Modi Expected to Attend
ఇది కూడా చదవండి…ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చో తెలుసా? పన్నుల వివరాలు ఇవే!
టీజర్, గ్లింప్స్‌కు అద్భుత స్పందన
జనవరి 26న విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా, ఫిబ్రవరి 9న విడుదలైన గ్లింప్స్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 26న మోహన్‌లాల్ పాత్రను అధికారికంగా రివీల్ చేయడంతో సినిమాపై ఉత్సాహం మరింత పెరిగింది.
మార్చి 27న పాన్ ఇండియా రిలీజ్
మలయాళంతో పాటు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో మరో భారీ విజయం అందుకోవడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది.