ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్‌లో సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన కెఎల్‌హెచ్‌ గ్లోబల్ బిజినెస్ స్కూల్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 3,2025: నగరంలోని కెఎల్‌హెచ్‌ గ్లోబల్ బిజినెస్ స్కూల్ (కెఎల్‌హెచ్‌ జిబిఎస్) డిజిటల్ మార్కెటింగ్‌లో ఏఐ (కృత్రిమ మేధస్సు) విలీనం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 3,2025: నగరంలోని కెఎల్‌హెచ్‌ గ్లోబల్ బిజినెస్ స్కూల్ (కెఎల్‌హెచ్‌ జిబిఎస్) డిజిటల్ మార్కెటింగ్‌లో ఏఐ (కృత్రిమ మేధస్సు) విలీనం చేసిన సరికొత్త సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మార్తాండ్ బిజినెస్ సామర్థ్యాలను పెంపొందించేందుకు లక్ష్యంగా నెలరోజుల పాటు హైబ్రిడ్ మోడల్‌లో ఈ కోర్సును రూపొందించారు.

ఈ కార్యక్రమం జూన్ 15న ప్రారంభమవుతోంది. 30 ఆన్‌లైన్ సెషన్లతో పాటు, హైదరాబాదులోని కెఎల్‌హెచ్‌ క్యాంపస్‌లో నాలుగు రోజుల క్యాంపస్ ఎంగేజ్‌మెంట్‌ను ఇందులో భాగంగా అందిస్తున్నారు. కోర్సు ఫీజు రూ.30,000గా నిర్ణయించారు. 18 ఏళ్లు దాటిన విద్యార్థులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, మార్కెటింగ్ నిపుణులు, కంటెంట్ క్రియేటర్లు పాల్గొనవచ్చు.

ఇది కూడా చదవండి…రూ.300 కోట్ల అంచనా ఆదాయంతో వుడ్స్ ఫేజ్-II ఆరంభం

ఈ సందర్భంగా కెఎల్ఈఎఫ్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్ మాట్లాడుతూ – ‘‘ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అనుభవం కలిగిన నైపుణ్యాలు ఈ కాలంలో అత్యవసరం. పరిశ్రమ-విద్య మధ్య గల అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే ఈ ప్రోగ్రామ్‌ రూపొందించాం,’’ అన్నారు.

కెఎల్‌హెచ్‌ జిబిఎస్ డీన్ డాక్టర్ ఆనంద్ బేతపూడి మాట్లాడుతూ – ‘‘ఏఐ ఆధారిత మార్కెటింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా కోర్సును రూపొందించాం. పాఠశాల దృక్కోణంలో ఇది ప్రపంచస్థాయి వ్యాపార నాయకులను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఒక భాగం’’ అని తెలిపారు.

ఈ కోర్సులో వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO), ఇమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, మీమ్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ ఔట్రీచ్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. చాట్‌జిపిటి, కాన్వా, గూగుల్ కీవర్డ్ ప్లానర్, మెటా యాడ్స్ మేనేజర్ వంటి ఆధునిక టూల్స్ ఉపయోగించడానికి ప్రత్యక్ష అనుభవాన్ని అందించనున్నారు.

Read This also…IndiGo and Garuda Indonesia Forge Codeshare Partnership to Boost Connectivity Between India and Indonesia

ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఓపెన్‌గా ఉండగా, రోలింగ్ అడ్మిషన్ విధానంలో అంగీకరిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సంస్థ సూచించింది.

మరిన్ని వివరణాత్మక సమాచారం కోసం, దయచేసి onlinegbs@klh.edu.in వద్ద సంప్రదించండి లేదా https://gbs.klh.edu.in/https://gbs.klh.edu.in/ ని సందర్శించండి.

About Author