గవర్నమెంట్ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ల సమావేశంలో కీలక సూచనలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 11,2024: నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతు.. రెండవ జిల్లా కలెక్టర్ల సమావేశానికి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 11,2024: నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతు.. రెండవ జిల్లా కలెక్టర్ల సమావేశానికి హాజరైన ప్రముఖులు, అధికారులు అందరికీ హృదయపూర్వక స్వాగతం.స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాలను సాధించడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో ఈ సమావేశం కీలక పాత్ర పోషించనుంది.
- గత సమావేశంలో ముఖ్యమంత్రి గారు కీలక సమస్యల పరిష్కారానికి సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపకల్పన, ఉచిత ఇసుక పంపిణీ, 15 శాతం జీఎస్డీపి లక్ష్యాలు, వృత్తి నైపుణ్యాల పెంపు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలపై దిశానిర్దేశం చేయడం జరిగింది.
- ఈ సమావేశంలో గత ఆరు నెలల్లో జరిగిన అభివృద్ధి, మొదటి సమావేశంలో చర్చించిన అంశాల ప్రగతి, వాటి అమలుపై సమీక్ష చేయనున్నారు.
- స్వర్ణాంధ్ర పది మార్గదర్శకాలు
- ప్రజా సమస్యల పరిష్కార ప్రగతి
- రియల్ టైమ్ గవర్నెన్స్
- వాట్సాప్ గవర్నెన్స్
- పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్
- 4 పీ విధానం (పబ్లిక్, పీపుల్, ప్రైవేట్, పార్టిసిపేషన్)
- గుంతల రహిత రహదారులు
- అమరావతి అభివృద్ధి పనులు, పోలవరం ప్రాజెక్టు పనుల పున:ప్రారంభం
జిల్లా కలెక్టర్లకు సూచనలు:
- ప్రభుత్వ విధానాలను సమగ్రమైన అవగాహనతో అమలు చేయాలి.
- ప్రజల నుండి వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టి, వాటిని వెంటనే పరిష్కరించాలి.
- రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ తదితర శాఖల సేవల అందజేతను మెరుగుపరచాలి.
- ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జిల్లా కలెక్టర్లు ప్రోయాక్టివ్‌గా పనిచేయాలి.
- రాష్ట్ర అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకం కావున, అంకితభావంతో విధులు నిర్వహించాలి.
రాష్ట్ర అభివృద్ధి పథంలో కలెక్టర్ల పాత్రను మెరుగుపరచడం, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం ముఖ్య ఉద్దేశ్యమని, కలెక్టర్లు తమ విధులను సమర్థంగా నిర్వహించాలన్నారు.