₹2,000 కోట్ల ఐపీవో కోసం సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన ఇన్నోవేటివ్యూ ఇండియా లిమిటెడ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 17,2025: భారతదేశంలో పరీక్షలు, ఎలక్షన్లు, భారీ కార్యక్రమాలు వంటి వాటికై ఆటోమేటెడ్ యాన్సిలరీ సెక్యూరిటీ, సర్వైలెన్స్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 17,2025: భారతదేశంలో పరీక్షలు, ఎలక్షన్లు, భారీ కార్యక్రమాలు వంటి వాటికై ఆటోమేటెడ్ యాన్సిలరీ సెక్యూరిటీ, సర్వైలెన్స్ సొల్యూషన్స్‌ను అందిస్తున్న టెక్నాలజీ ఆధారిత కంపెనీ అయిన ఇన్నోవేటివ్యూ ఇండియా లిమిటెడ్ (Innovatiview India Limited) తమ ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది.

ఈ ఐపీవో ద్వారా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పధ్ధతిలో షేర్లను విక్రయించి రూ. 2,000 కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేరు ముఖ విలువ ₹5గా నిర్ణయించింది.

భారతదేశంలో ఎగ్జామినేషన్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ విభాగంలో ఇన్నోవేటివ్యూ ఇండియా లిమిటెడ్ 2024 ఆర్థిక సంవత్సరంలో 73.7% మార్కెట్ వాటాతో అతి పెద్ద కంపెనీగా నిలిచింది. అలాగే, 2024 ఆర్థిక సంవత్సరంలో ఎగ్జామినేషన్ సెక్యూరిటీ, సర్వైలెన్స్ పరిశ్రమలో కంపెనీ మార్కెట్ వాటా 69.07% వరకు పెరిగింది. (మూలం: F&S నివేదిక)

DAM క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, షనాన్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఐపీవోకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

About Author