సెప్సిస్ గుర్తింపు కోసం నూతన బయోసెన్సర్ పరిశోధన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 23, 2025: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కెఎల్ఈఎఫ్) నుండి ఒక ప్రముఖ అధ్యాపకుడు, కెమిస్ట్రీ విభాగంలోని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 23, 2025: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కెఎల్ఈఎఫ్) నుండి ఒక ప్రముఖ అధ్యాపకుడు, కెమిస్ట్రీ విభాగంలోని డాక్టర్ టి. అనూష, జర్మనీలోని టియు బెర్గాకడెమీ ఫ్రీబర్గ్‌లో డాక్టర్ పర్వానేహ్ రహీమితో కలిసి సెప్సిస్ ముందస్తుగా గుర్తించడానికి కొత్త తరహా బయోసెన్సర్ అభివృద్ధిపై పరిశోధన చేస్తున్నారు.

“డెవలప్మెంట్ అఫ్ ఎలక్ట్రోకెమికల్ బయోసెన్సింగ్ ప్లాట్‌ఫామ్ ఫర్ మల్టీప్లెక్స్డ్ సైమల్టేనియస్ డిటెక్షన్ ఆఫ్ సెప్సిస్ బయోమార్కర్స్” పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (ఐజిఎస్టిసి) ఆధ్వర్యంలో నిధులు అందజేయబడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం వివిధ సెప్సిస్ బయోమార్కర్లను ఒకేసారి గుర్తించగల తక్కువ ధర, పోర్టబుల్, వేగవంతమైన బయోసెన్సర్ రూపొందించడం.

శరీరం ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించి సంభవించే ప్రాణాంతక పరిస్థితి అయిన సెప్సిస్‌ను త్వరగా, ఖచ్చితంగా గుర్తించడం అత్యవసర గదులు, ఐసియు లలో మరణాల రేటు తగ్గించడంలో కీలకమని పరిశోధకులు తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ వలన పల్లె, పట్టణ ప్రాంతాలలోని రోగులు, వైద్యులు త్వరిత, ఖచ్చితమైన రోగనిర్ధారణ సాధనాల నుండి లాభపడగలుగుతారు. ప్రస్తుత డయాగ్నస్టిక్ ప్రయోగశాలలు, ఐసియు యూనిట్ల పనితీరును మెరుగుపరిచే ఈ సాంకేతికత తక్కువ వనరులున్న ప్రాంతాల్లోని పాయింట్-ఆఫ్-కేర్ సదుపాయాలకు సైతం అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు, బయోమెడికల్ పరికరాలు తయారీలో నిమగ్నమైన స్టార్టప్స్, ఆరోగ్య పరిశ్రమలకు కొత్త అవకాశాలు సృష్టిస్తుంది.

చిన్న రక్త నమూనా ఆధారంగా నిమిషాల్లో ఫలితాలు ఇవ్వగల బయోసెన్సర్ ప్రోటోటైప్ అభివృద్ధి ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఇది వైద్యులకు చికిత్సను త్వరగా ప్రారంభించే అవకాశం కల్పిస్తూ, రోగుల మృతి రేటును తగ్గించడంలో సహాయపడుతుంది.

డాక్టర్ అనూష ఆగస్టు 2025లో జర్మనీని సందర్శించి, ఫ్రీబర్గ్‌లోని పరిశోధనా బృందంతో కలిసి బయోసెన్సర్ అభివృద్ధిని వేగవంతం చేస్తారని తెలుస్తోంది.

కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్ మాట్లాడుతూ, “మా అధ్యాపకుల విజయం మాకు గర్వకారణం. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం, ఉమ్మడి పరిశోధన కార్యాచరణ వల్ల బయోసెన్సర్ రంగంలో గొప్ప పురోగతి సాధ్యమవుతుంది. కెఎల్ఈఎఫ్ శక్తివంతమైన పరిశోధన వాతావరణాన్ని కల్పించి, ఆరోగ్య సంరక్షణలో వినూత్న పరిష్కారాలను తీసుకురావడానికి కట్టుబడింది” అన్నారు.

కెమిస్ట్రీ విభాగం ఇంతకుముందు కూడా ఇంటర్‌డిసిప్లినరీ పరిశోధనలో సానుకూలమైన పాత్ర పోషిస్తూ, ఆరోగ్య రంగంలో కీలక విజయాలకు నాయ‌కత్వం వహిస్తోంది. ఈ తాజా ప్రాజెక్ట్ ఆలోచన, సాంకేతికత , ప్రపంచ భాగస్వామ్యాల సమ్మేళనంతో సెప్సిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల గుర్తింపులో కొత్త మైలురాయిని ఏర్పరుస్తోంది.

About Author