ఐఐఎం విశాఖపట్నం, టైమ్స్ ప్రో కలిసి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ వింటర్ల అడ్మిషన్లు ప్రారంభం.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విశాఖపట్నం,సెప్టెంబర్ 17,2024: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) విశాఖపట్నం,ఎగ్జిక్యూటివ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విశాఖపట్నం,సెప్టెంబర్ 17,2024: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) విశాఖపట్నం,ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) ప్రోగ్రామ్‌కు సంబంధించి వింటర్ అడ్మిషన్లను ప్రకటించింది.

టైమ్స్ ప్రోతో భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్ ప్రస్తుత మేనేజ్‌మెంట్ నైపుణ్యాలతో నిపుణులను శక్తివంతం చేస్తూ, అభివృద్ధి చెందుతున్న వ్యాపార వాతావరణంలో నాయకత్వ పాత్రల కోసం వారికి సాధికారతనిస్తుంది.

ఈ ప్రోగ్రామ్, అభ్యాసకులు సంస్థాగత నాయకులుగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ఆధునిక నిర్వహణ పద్ధతులను లోతుగా తెలుసుకునేందుకు ,సమగ్ర నిర్వాహక సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి సహకరిస్తుంది.

ఇది వినూత్న ఆలోచనలతో అభ్యాసకులను పరివర్తనాత్మక అనుభవాన్ని పొందేలా చేస్తుంది. వ్యూహాత్మక దృక్కోణాలను అభివృద్ధి చేస్తూ, సైద్ధాంతిక ఫ్రేమ్‌వర్క్‌లను ఆచరణలో అమలు చేయడానికి అభ్యాసకులను సన్నద్ధం చేస్తుంది.

మారుతున్న వ్యాపార పరిస్థితుల క్రమంలో, ఆధునిక నైపుణ్యాలు అభ్యాసకులకు ముఖ్యమని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించింది. 2025 నాటికి సగం మంది కార్మికులకు రీస్కిల్లింగ్ అవసరం ఉందని అంచనా వేసింది. ఈ విధంగా పెంపొందించే నైపుణ్యాలు 2030 నాటికి అంతర్జాతీయ స్థాయిలో జిడిపిని 8.3 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచగలవని అంచనా.

లింక్డ్‌ఇన్ సర్వే ప్రకారం, 10 మంది ఎగ్జిక్యూటివ్‌లలో 9 మంది సాఫ్ట్ స్కిల్స్ అనేవి అత్యంత ముఖ్యమని అంగీకరిస్తున్నారు. 2015 నుండి నైపుణ్యాలలో 25% మార్పు చోటుచేసుకుంటుందని, 2030 నాటికి ఈ మార్పు 65%కి చేరుతుందని అంచనా.

ఈ సందర్భంగా ఐఐఎం విశాఖపట్నం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘‘టైమ్స్ ప్రోతో కలిసి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం సంతోషకరమని, ఈ ప్రోగ్రామ్ వ్యాపార నాయకులను ముందుకు నడిపించగల సామర్థ్యాలను అందిస్తుందని అన్నారు.’’

టైమ్స్ ప్రో సీఈఓ అనీష్ శ్రీకృష్ణ మాట్లాడుతూ, ‘‘ఈ ప్రోగ్రామ్, ఐఐఎం విశాఖపట్నం ఫ్యాకల్టీ నేతృత్వంలో విస్తృత పరిశ్రమల నిపుణులతో అభ్యాసకులను మిళితం చేస్తుంది’’ అని అన్నారు.

గత బ్యాచ్‌లలో విభిన్న రంగాలకు చెందిన 3 నుండి 25 ఏళ్ల అనుభవం కలిగిన నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ 740 గంటల కఠిన అభ్యాసంతో పాటు ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్‌లో రెండు క్యాంపస్ మాడ్యూల్స్‌ను కలిగి ఉంటుంది.

ఈ ప్రోగ్రామ్, టైమ్స్ ప్రో ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్వహించనుంది.

About Author