చింతల బస్తీలో నాలా ఆక్రమణలను తొలగించిన హైడ్రా.
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 11,2025: నగరంలో నాల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. బుధవారం చింతల బస్తీలో నాలా ఆక్రమణలను హైడ్రా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 11,2025: నగరంలో నాల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. బుధవారం చింతల బస్తీలో నాలా ఆక్రమణలను హైడ్రా తొలగించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వద్ద ఉన్న కల్వర్టుకు చింతల బస్తీ వైపు ఆక్రమణలు జరిగాయి.
ఇది కూడా చదవండి..రుతుపవనాల వేళలో దీర్ఘకాలిక ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సహజ పేటెంట్ చికిత్స – ‘ఎత్నిక్’ నుంచి స్కిన్ రివైవ్
Read This also…MG Windsor, India’s Best-Selling EV, Inches Closer to 30,000* Sales Mark
మొత్తం 15 మీటర్ల వెడల్పు కల్వర్టు కింద ఉండగా చింతలబస్తే వైపు 7 మీటర్ల మేర కబ్జా జరిగినట్టు నిర్ధారణకు వచ్చిన హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగాంచారు.

ఇసుక, చిన్న సిమెంట్ దుకాణంతో పాటు కల్లు కాంపౌండ్ రేకుల షెడ్డు ను తొలగించారు. పింఛను ఆఫీసు వద్ద ఉన్న కల్వర్టు ను పూర్తి స్థాయిలో హైడ్రా విస్తరిస్తోంది.
ఇది కూడా చదవండి..హైదరాబాద్లో 100+ హెయిర్స్టైలిస్ట్లకు ‘సర్రియల్ కలెక్షన్’తో గోద్రెజ్ ప్రొఫెషనల్ శిక్షణ..
Read This also…Godrej Professional Empowers Over 100 Hyderabad Hairstylists with Surreal Collection Launch
శంకర్పల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి మొదలై నాగులపల్లి, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, మేహిదీపట్నం, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, చింతలబస్తి, తుమ్మలబస్తీ మీదుగా హుస్సేన్ సాగర్ కలిసే చారిత్రక బుల్కాపూర్ నాలా సాఫీగా సాగేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది.