రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టారు.
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 25,2025: పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లేఔట్ చుట్టూ ఉన్న ప్రహరీని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 25,2025: పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లేఔట్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేశారు.
దివ్యనగర్ లేఔట్ చుట్టూ అక్రమంగా నిర్మించిన ప్రహరీ, గేటుతో వెళ్లేందుకు అనుమతించకపోవడం పై ప్లాట్ యజమానులు నల్ల మల్లారెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో, హైడ్రా కమిషనర్ జనవరి 8న క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ఇరు పక్షాల ఫిర్యాదులపై జనవరి 23న హైడ్రా ప్రధాన కార్యాలయంలో చర్చ నిర్వహించారు.
- దివ్యనగర్ లేఔట్ నుండి ఇతర లేఔట్లకు దారులను మూసివేయడం.
- లేఔట్ ప్లాట్ల అమ్మకాలకు అవరోధాలు కల్పించడం.
- ప్లాట్ యజమానుల నుంచి డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసి, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం.
- గేటు వద్ద ప్రవేశానికి నియమాలు విధించి, అనుమతులకు నల్ల మల్లారెడ్డి నిర్ణయం తీసుకోవడం.
- ప్లాట్లను ఇతరులకు చూపేందుకు లేదా అమ్మేందుకు కూడా అవరోధాలు కల్పించడం.

ఇరు పక్షాల వాదనల ఆధారంగా, ప్రహరీ నిర్మాణానికి అనుమతులు లేవని నిర్ధారించగా, శనివారం కూల్చివేత చర్యలు చేపట్టారు.
దివ్యనగర్ లేఔట్ ప్రహరీ తొలగింపుతో
- ఏకశిలా లేఔట్, వెంకటాద్రి టౌన్‌షిప్, సుప్రభాత్ వెంచర్ -1, మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, హిల్స్ వ్యూ కాలనీ వంటి పలు కాలనీలకు మార్గం సుగమమైంది.
- ప్లాట్ యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.
200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దివ్యనగర్ లేఔట్‌లో మొత్తం 2218 ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనని సమాచారం.
సర్వే నంబరు 66లో 6.06 ఎకరాల ప్రభుత్వ భూమిని నల్ల మల్లారెడ్డి కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ చర్యల ద్వారా దివ్యనగర్ లేఔట్ ప్రాంతంలో నివాసితులకు సౌకర్యాలు మెరుగుపడ్డాయి.