హోంగార్డ్స్ నైపుణ్య అభివృద్ధితో మెరుగైన సేవలు – కమాండెంట్ మహేష్ కుమార్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, మార్చి 10,2025: విధుల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, మార్చి 10,2025: విధుల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్ ఇన్చార్జి కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పరేడ్‌ను తనిఖీ చేసి, అనంతరం హోంగార్డ్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అని ఆయన సూచించారు. హోంగార్డ్స్ విధులు ప్రతిదినం సవాళ్లతో కూడుకున్నవని, వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి…కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

Read this also…Workshop on “Online Journalism – Empowering Women Journalists” under the auspices of the TMedia Academy

ఇది కూడా చదవండి…తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్ జర్నలిజంపై మహిళా జర్నలిస్టులకు శిక్షణా తరగతులు

ఆరోగ్య పరిరక్షణపై సూచనలు
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరమని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధులు సమర్థవంతంగా నిర్వర్తించగలమని కమాండెంట్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఇన్సూరెన్స్ లు రెన్యువల్ అయ్యాయా లేదా పర్యవేక్షించుకోవాలని సూచించారు.

హోంగార్డ్స్ సమస్యల పరిష్కారానికి కృషి
విధుల్లో సమర్థత పెంచుకోవడానికి పలు సూచనలు చేయడంతో పాటు, హోంగార్డ్స్‌ సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా దర్బార్ నిర్వహించారు. తమ సమస్యలను సబ్ డివిజన్ ఇంచార్జిల ద్వారా పరిష్కరించుకోవాలని, లేకుంటే ఆర్‌ఐ గారికి తెలియజేయాలని సూచించారు.

Read this also…Experience the Best of K-Dramas on Tata Play K-Dramas..

Read this also…Jawa Yezdi and BSA Launch Segment-Leading Ownership Assurance Program

ఇది కూడా చదవండి…జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు

ఉత్తమ సేవలకు ప్రశంసలు
విధి నిర్వహణలో ప్రతిభ చూపిన హోంగార్డ్స్‌కు కమాండెంట్ ప్రశంసా పత్రాలను అందజేశారు. హోంగార్డ్స్‌కు మరింత ప్రోత్సాహం అందించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. హోంగార్డుల సమస్యలను తిరుపతి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్ డీఎస్పీ చిరంజీవి, ఆర్‌ఐ పోతురాజు, హోంగార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author