ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఎదురైన భయంకర అనుభవం – హలో బేబీ మూవీ రివ్యూ & రేటింగ్..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 25,2025: టాలీవుడ్లో సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘హలో బేబీ’ ఈ శుక్రవారం (ఏప్రిల్ 25) థియేటర్లలో ప్రేక్షకుల

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 25,2025: టాలీవుడ్లో సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘హలో బేబీ’ ఈ శుక్రవారం (ఏప్రిల్ 25) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో, రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కావ్య కీర్తి ఒక్కతే ప్రధాన పాత్ర పోషించారు. హ్యాకింగ్ నేపథ్యంలో నడిచే థ్రిల్లింగ్ కథతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతోంది.
కథా సారాంశం:
బెంగళూరులో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే సోఫ్ట్వేర్ ఉద్యోగి ఆద్య (కావ్య కీర్తి) తన నిత్యజీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తోంది. ఒక్కసారిగా ఆమె కాలేజీ ఫ్రెండ్ రాహుల్ కాల్ చేసి ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తాడు. ఆమె ఇంట్లో ఏమి చేస్తున్నదో, ఏ దుస్తుల్లో ఉందో చెప్పడం మొదలుపెడతాడు. దాంతో ఆద్యకు భయాలు మొదలవుతాయి.
Also read this…The OP Performer – OPPO K13 5G Hits the Market at Rs.16,999 from April 25
Also read this…Sri Sathya Sai Prema Pravahini: Nationwide Rath Yatra Flagged Off to Celebrate the Birth Centenary of Bhagawan Sri Sathya Sai Baba
ఉద్యోగం, ఫ్రెండ్స్, అమ్మతో సంబంధాలు గందరగోళమవుతాయి. ఈ సమస్యల నుంచి ఆద్య ఎలా బయటపడింది? రాహుల్ ఎందుకు అలా చేశాడు? అనేదే సినిమా కథాంశం.

విశ్లేషణ:
కావ్య కీర్తి పాత్రను ఒంటి భయాన్ని ఒళ్లెళ్లిస్తున్న నటనతో పోషించింది. మొత్తం సినిమా ఆమె ఒక్కరితో నడవటం, దానికితోడు స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా ఉంచడం దర్శకుడి టేకింగ్‌కు నిదర్శనం. ఇంట్లోని పరిసరాల్లోనే కథను పటిష్ఠంగా నడిపించడం చిన్న విషయం కాదు. కెమెరా వర్క్, లైటింగ్, విజువల్స్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. సుకుమార్.పి అందించిన సంగీతం, సాయిరాం తాటిపల్లి చేసిన ఎడిటింగ్ సినిమాకు మంచి మద్దతుగా నిలిచాయి.
డైరెక్షన్ & టెక్నికల్ వర్క్:
రామ్ గోపాల్ రత్నం దర్శకత్వం బాగా కుదిరింది. స్క్రీన్‌ప్లేలో ఎక్కడా నొచ్చకుండా గ్రిప్‌ను పటిష్ఠంగా ఉంచారు. కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నిర్మాత ఆదినారాయణకు అభినందనలు చెప్పాలి, ఇలాంటి ప్రయోగాత్మక కథకు ముందుకొచ్చినందుకు.
‘హలో బేబీ’ — డిఫరెంట్ కాన్సెప్ట్, ఇంటెన్స్ థ్రిల్లింగ్ కథనంతో ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించే సినిమా. ఒకే క్యారెక్టర్‌తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని పండించిన దర్శకుడు మంచి పనితీరు చూపించారు. థ్రిల్లర్ ప్రేమికులు తప్పక చూడాల్సిన సినిమా.
వారాహి మీడియా డాట్ కామ్ రేటింగ్: ★★★☆☆ (3/5)