శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 6,2024: పి.ఎస్.ఎల్.వి.-సి59 వాహక నౌకను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శ్రీహరికోట షార్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 6,2024: పి.ఎస్.ఎల్.వి.-సి59 వాహక నౌకను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శ్రీహరికోట షార్ శాస్త్రవేత్త లందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసిఎస్ఏ)కి చెందిన ప్రోబా-3లోని రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ ఉపగ్రహాలు సూర్యుడి బాహ్య వాతావరణంపై పరిశోధనలు చేయడానికి మద్దతుగా పని చేస్తాయి.
ఈ విజయవంతమైన ప్రయోగంతో మనం సౌర అన్వేషణలో మరో కీలకమైన అడుగు ముందుకు వేస్తున్నాము. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలకు ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఈ ప్రోత్సాహంతో మన శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయిలో విశేష విజయాలను సాధిస్తున్నారు.
ఈ స్ఫూర్తి మన శాస్త్రవేత్తలను మరిన్ని ప్రగతిశీలమైన, విజయవంతమైన పరిశోధనల వైపు నడిపిస్తుందని ఆకాంక్షిస్తున్నాను.