చిన్నన్నయ్య నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 29,2024: సామాజికాంశాల ను సునిశితంగా విశ్లేషించి, ప్రజా పక్షం వహిస్తూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 29,2024: సామాజికాంశాల ను సునిశితంగా విశ్లేషించి, ప్రజా పక్షం వహిస్తూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతారు మా చిన్నన్నయ్య నాగబాబు . చిన్నన్నయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 

నెల్లూరులో నాగబాబు గారు లా చదువుకొనే రోజుల్లో నానీ పాల్కీవాలా రచనల గురించి నాకు చెప్పేవారు. అదే విధంగా సాహిత్యంతోపాటు సామాజిక రాజకీయ అంశాలను తెలిపే పుస్తకాల గురించి పరిచయం చేసింది నాగబాబు గారే.

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ శ్రేణులతో మమేకమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో అన్నీ తానై పని చేశారు. చిన్నన్నయ్య నాగబాబు కి సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనందాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

About Author