గురు నానక్ యూనివర్సిటీ-ఇంటెలిపాట్ ఒప్పందం: హైదరాబాద్‌లో పరిశ్రమ ఆధారిత టెక్ కోర్సులు ప్రారంభం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 4,2025:హైదరాబాద్‌కి చెందిన యూజీసీ గుర్తింపు పొందిన గురు నానక్ యూనివర్శిటీ (GNU), ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 4,2025:హైదరాబాద్‌కి చెందిన యూజీసీ గుర్తింపు పొందిన గురు నానక్ యూనివర్శిటీ (GNU), ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ (IST)తో పరిశ్రమ అనుభవాన్ని కలగలిపిన ఆధునిక టెక్నాలజీ కోర్సులు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు ప్రత్యేకంగా ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందం ద్వారా GNU, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్ (ML) స్పెషలైజేషన్‌తో కూడిన B.Tech కోర్సును అందించనుంది. విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన మాడ్యూల్స్, లైవ్ ప్రాజెక్టులు, గెస్ట్ లెక్చర్లతో పాటు చివరి సంవత్సరం ఇంటర్న్‌షిప్ వంటి అవకాశాలు కలుగనున్నాయి.
Read This also…Guru Nanak University Partners with Intellipaat to Launch Industry-Driven B.Tech Programs in Hyderabad
Read This also…Chaurya Paatham: Crime Meets Comedy in a Rural Heist Gone Wrong..
ఈ సందర్భంగా ఇంటెలిపాట్ సీఈఓ & వ్యవస్థాపకుడు దివాకర్ చిట్టోరా మాట్లాడుతూ – “విద్యార్థులు అకడమిక్ నాలెడ్జ్‌తో పాటు పరిశ్రమలో వాడే నైపుణ్యాలను కూడా పొందుతారు. ఇప్పటికే ఇంటెలిపాట్ శిక్షణతో వేలాది మంది విద్యార్థులు టాప్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు.

GNU విద్యార్థులకు IITలు, NITల నిపుణుల తో శిక్షణ, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, Roorkee IIT క్యాంపస్‌లో ఇమర్షన్ ప్రోగ్రామ్ వంటి ప్రత్యేక సదుపాయాలు కలుగుతాయి” అని తెలిపారు.
విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డా. హెచ్.ఎస్. సైనీ మాట్లాడుతూ – “ఇది మా యూనివర్శిటీకి ఒక కీలక ముందడుగు. ఇంటెలిపాట్తో భాగస్వామ్యం వల్ల మా విద్యార్థులు పరిశ్రమ అవసరాలను నేరుగా నేర్చుకుంటారు. ఇదే సమయంలో ఉద్యోగాల అవకాశాల్లోనూ వారు ముందుండగలుగుతారు” అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి…రూ.300 కోట్ల అంచనా ఆదాయంతో వుడ్స్ ఫేజ్-II ఆరంభం
Read This also…IndiGo and Garuda Indonesia Forge Codeshare Partnership to Boost Connectivity Between India and Indonesia
ఈ ఒప్పందంపై సంతకాలు దివాకర్ చిట్టోరా, డా. హెచ్.ఎస్. సైనీ లు బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధుల సమక్షంలో చేశారు.
ఈ భాగస్వామ్యం ద్వారా విద్యారంగం – పరిశ్రమల మధ్య ఖాళీ పూడుస్తూ, విద్యార్థులకు భవిష్యత్‌కు సిద్ధమయ్యేలా GNU, ఇంటెలిపాట్ కలిసి పనిచేయనున్నాయి.