గ్రోమ్యాక్స్ 25వ వార్షికోత్సవం – కొత్త ట్రాక్టర్ల ఆవిష్కరణ
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,ఫిబ్రవరి 27,2025: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, గుజరాత్ ప్రభుత్వ జాయింట్ వెంచర్ అయిన గ్రోమ్యాక్స్ అగ్రి ఎక్విప్‌మెంట్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,ఫిబ్రవరి 27,2025: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, గుజరాత్ ప్రభుత్వ జాయింట్ వెంచర్ అయిన గ్రోమ్యాక్స్ అగ్రి ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ (గతంలో మహీంద్రా గుజరాత్ ట్రాక్టర్ లిమిటెడ్) తన 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. అందుబాటు ధరలో ఆధునిక యాంత్రీకరణ పరికరాలను అందించడం ద్వారా భారతీయ రైతులను సాధికారత కల్పించే లక్ష్యంగా కంపెనీ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
1999లో మహీంద్రా కంపెనీలో మెజారిటీ వాటాను పొందడంతో మహీంద్రా గుజరాత్ ట్రాక్టర్ లిమిటెడ్ గా పేరు మారింది. 2017లో గ్రోమ్యాక్స్ అగ్రి ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ గా పునర్నామకరణం చేయడంతో, భారత రైతులకు ప్రత్యేకమైన, అందుబాటు యాంత్రీకరణ పరిష్కారాలను అందించేందుకు కొత్త దిశలో అడుగులు వేసింది.

గత 25 ఏళ్లలో, గ్రోమ్యాక్స్ తన ట్రాక్టర్ శ్రేణిని TRAKSTAR (2017లో ప్రారంభించిన),HINDUSTAN బ్రాండ్‌ల కింద 20-50 HP శ్రేణిలో 4 మోడళ్ల నుంచి 40 వేరియంట్ల వరకు విస్తరించింది. అదనంగా, TRAKMATE బ్రాండ్ కింద వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తెచ్చింది.
కొత్తగా ప్రవేశపెట్టిన ట్రాక్టర్లు 4WD ట్రాక్టర్ మోడళ్లు – Trakstar 525, Trakstar 536
2WD ట్రాక్టర్ వేరియంట్లు – 24HP, 31HP, 36HP (ఉద్యానపంటల కోసం ప్రత్యేకంగా)
కాషాయ, నలుపు రంగుల్లో ప్రత్యేక ఎడిషన్ ట్రాక్టర్లు – యువ రైతులను ఆకర్షించేందుకు, బ్రాండ్ వేర్వేరు రంగులలో ప్రత్యేక డిజైన్‌ను అందించింది.
గ్రోమ్యాక్స్ విజయంపై మహీంద్రా ప్రతినిధి హేమంత్ సిక్కా వ్యాఖ్యలు
“25 ఏళ్ల ప్రయాణం గర్వకారణం. ‘సాగులో పరివర్తనం, రైతు జీవితాల్లో మార్పు’ మా లక్ష్యం. ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన మా కస్టమర్లు, భాగస్వాములు, గుజరాత్ ప్రభుత్వం, మా ఉద్యోగులకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరింత ప్రగతిని సాధించేందుకు గ్రోమ్యాక్స్ సిద్ధంగా ఉంది.”

జాయింట్ వెంచర్: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (60%) – గుజరాత్ ప్రభుత్వం (40%)
తయారీ ప్లాంట్: వడోదర, గుజరాత్
గ్రోమ్యాక్స్ నూతన పరిజ్ఞానం, శక్తివంతమైన ట్రాక్టర్లు, విభిన్న రంగుల ఆవిష్కరణలతో భారతీయ రైతులకు మరింత చేరువ కానుంది.