చిత్రకూట్‌లో మహా కుంభమేళా సందర్భంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం వైభవంగా
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 22,2025: మహా కుంభమేళా సందర్భంగా త్రేతాయుగంలో రాములవారు సీతాదేవి, లక్ష్మణులతో కలిసి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన
![](https://varahimedia.com/wp-content/uploads/2025/01/SriSrinivasaKalyanam.jpg)
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 22,2025: మహా కుంభమేళా సందర్భంగా త్రేతాయుగంలో రాములవారు సీతాదేవి, లక్ష్మణులతో కలిసి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన పవిత్రమైన మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ నగరంలో, ఉత్తరాది అహోబిల మఠంలో బుధవారం ఉదయం శ్రీ శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు.
![](http://varahimedia.com/wp-content/uploads/2025/01/SriSrinivasaKalyanam.jpg)
అనంతరం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్తసంకల్పం, మహాసంకల్పం, మాంగళ్య పూజ, మంగళసూత్రధారణ మొదలయిన శాస్త్రోక్త ఘట్టాలతో శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణం నిర్వహించారు.
చివరిలో, శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడం ద్వారా కళ్యాణం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని నేత్రపర్వంగా వీక్షించిన భక్తులు భక్తిపరవశత్వంతో పులకించిపోయారు.
![](http://varahimedia.com/wp-content/uploads/2025/01/SriSrinivasaKalyanam.jpg)
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ 1008 రాజ్ గురు పీఠాధీశ్వర్ స్వామి బద్రి ప్రపన్నాచార్యజీ మహరాజ్, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి, బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ స్వామి ,ఇతర అధికారులు పాల్గొన్నారు.