“తెలంగాణ ప్రభుత్వంతో గోద్రెజ్ క్యాపిటల్ ఆర్థిక సహకారం: MSMEలకు కొత్త రుణ అవకాశాలు”

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తెలంగాణ,ఏప్రిల్ 13,2025: గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన ఆర్థిక సేవల కంపెనీ గోద్రెజ్ క్యాపిటల్ తమ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల ద్వారా తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రుణ, వ్యాపార అవకాశాల లభ్యతను పెంచి ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడనుంది.

తొలిసారిగా రుణం తీసుకుంటున్నవారు, ముఖ్యంగా రుణ సదుపాయం అంతగా లేనివారికి రుణాల లభ్యతను మెరుగుపర్చడం ద్వారా ఎంఎస్ఎంఈ వ్యవస్థను పటిష్టం చేయడం ఈ భాగస్వామ్య లక్ష్యం. మహిళల కోసం ఉద్దేశించిన ఆరోహి పథకం ద్వారా మహిళా ఎంట్రప్రెన్యూర్లకు తోడ్పాటు అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. 

Read this also…Godrej Capital and Government of Telangana Sign MoU to Boost MSME Growth

Read this also…Bank of India Celebrates 10 Years of Transformative Impact Through Pradhan Mantri Mudra Yojana

“ఎంఎస్ఎంఈ వ్యవస్థను పటిష్టం చేయడంలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడం మాకు గర్వకారణమైన విషయం. ఎంఎస్ఎంఈ వ్యవస్థకు, ముఖ్యంగా మహిళల సారథ్యంలోని సంస్థలకు సాధికారత కల్పించే దిశగా ఈ భాగస్వామ్యం ఒక కీలక ముందడగు కాగలదు” అని గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ &సీఈవో మనీష్ షా తెలిపారు.

“స్థానిక ఎంఎస్ఎంఈలు, ముఖ్యంగా మహిళా ఎంట్రప్రెన్యూర్లకు అనుగుణంగా ఉండేలా వినూత్నమైన, డిజిటల్ ఫస్ట్ రుణ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో గోద్రెజ్ క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థలైన గోద్రెజ్ ఫైనాన్స్ లిమిటెడ్, గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో జట్టు కట్టడం సంతోషకరమైన విషయం.

ఇటీవల ప్రవేశపెట్టిన ఎంఎస్ఎంఈ పాలసీ కింద అంతగా రుణ సదుపాయం లేని ఎంఎస్ఎంఈలకు రుణ లభ్యతను మెరుగుపర్చే దిశగా ఆర్థిక సంస్థలతో ఇలాంటి భాగస్వామ్యాలను కుదుర్చుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా ఈ ఎంవోయూ ఒక కీలక ముందడుగు కాగలదు” అని పరిశ్రమలు & వాణిజ్య విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ Dr. జయేష్ రంజన్ తెలిపారు.

Read this also…JSW Paints Launches ‘Rangon Ka Khel 2.0’ – A Vibrant Celebration of IPL 2025

Read this also…Coventry University Group and GITAM Forge Strategic Partnership to Launch Dual Degree PhD Program

ఎంఎస్ఎంఈలు, ఇతర రుణార్థుల అవసరాలకు అనుగుణంగా తమ అనుబంధ సంస్థల ద్వారా గోద్రెజ్ క్యాపిటల్ వివిధ రకాల రుణ సాధనాలను అందిస్తోంది. ప్రాపర్టీపై రుణాలు, చిన్న మొత్తాల్లో ఉద్యోగ్ లోన్ ఎగెనెస్ట్ ప్రాపర్టీ, అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ మొదలైనవి వీటిలో ఉన్నాయి.

About Author