L2 ఎంపురాన్’ నుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రను రివీల్ చేసిన చిత్ర బృందం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 1,2025:మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘L2 ఎంపురాన్’ మార్చి 27, 2025న

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 1,2025:మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘L2 ఎంపురాన్’ మార్చి 27, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2019లో వచ్చిన ‘లూసిఫెర్’ చిత్రానికి ఇది సీక్వెల్ కాగా, అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో చిత్రయూనిట్ ఒక్కో కీలక పాత్రను రివీల్ చేస్తూ ఆసక్తిని పెంచుతోంది.
తాజాగా, హాలీవుడ్ ప్రముఖ నటుడు జెరోమ్ ఫ్లిన్ ఈ సినిమాలో బోరిస్ ఆలివర్ అనే ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో బ్రోన్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జెరోమ్ ఫ్లిన్, జాన్ విక్ చాప్టర్ 3, సోల్జర్ సోల్జర్, బ్లాక్ మిర్రర్ వంటి ప్రాజెక్టుల్లో కూడా తన ప్రతిభను ప్రదర్శించారు.
Read this also... L2: Empuraan Goes Global – Game of Thrones Star Jerome Flynn Joins the Cast
ఇది కూడా చదవండి...స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ – భారత్‌లో అతిపెద్ద హోమ్ హెల్త్ కేర్ నెట్‌వర్క్ విస్తరణ
Read this also... Star Health Insurance Expands Home Health Care Network to 100 Locations Across India
Read this also...Godrej Enterprises Group’s Locks and Architectural Solutions Shines at India Design Mark Awards 2024
జెరోమ్ ఫ్లిన్ మాట్లాడుతూ.. “నేను ఈ ప్రాజెక్టులో ఎలా చేరాను అన్న విషయం అంతగా గుర్తులేదు, కానీ ఈ అనుభవం నాకు పూర్తిగా కొత్తది. యూకే, యూఎస్‌లో నేను గడిపిన అనుభవాలకు భిన్నంగా, మాలీవుడ్ చిత్రసీమలో పని చేయడం ప్రత్యేకమైన అనుభూతి. నా యువకాలంలో నేను భారతదేశంలో ఆధ్యాత్మిక యాత్రలు చేశాను. ఆ అనుభవాలు నా జీవితాన్ని మార్చాయి. ‘L2 ఎంపురాన్’ లో నటించడం ద్వారా మళ్లీ ఇండియాకు వచ్చిన భావన కలిగింది” అని అన్నారు.

తన పాత్ర గురించి వివరాలు వెల్లడించకుండా, ఖురేషి పాత్ర ప్రయాణంలో ఇది కీలకమైన పాత్ర అని, ప్రేక్షకులకు నచ్చుతుందని జెరోమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘L2 ఎంపురాన్’ లో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, బైజు సంతోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read this also...TRISHULA SNANAM PERFORMED AT SRI KAPILESWARA SWAMY TEMPLE
ఇది కూడా చదవండి...సింహ వాహన సేవలో శ్రీ యోగ నరసింహ స్వామి అలంకారంలో శ్రీనివాసుడు
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్లపై సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మించగా, దీపక్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. GKM తమిళ్ కుమరన్ లైకా ప్రొడక్షన్స్ హెడ్‌గా వ్యవహరించారు. ‘L2 ఎంపురాన్’ మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది.