31 వ తేదీనే పింఛన్లు ఇవ్వడం దేశచరిత్రలో మొదటిసారి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 31,2024: దేశచరిత్రలో ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడూ లేనివిధంగా 1వ తేదీకి ఒక రోజు ముందే
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 31,2024: దేశచరిత్రలో ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడూ లేనివిధంగా 1వ తేదీకి ఒక రోజు ముందే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడం ఓ సరికొత్త రికార్డ్ అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర తెలియజేశారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 44వ డివిజన్ లీలామహాల్‌సెంటర్ పరిసర ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ఆమె శనివారం ఉదయం పింఛన్లను పంపిణీ చేశారు. డివిజన్ పరిధిలోని లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆమె… వారికి ప్రభుత్వం నుంచి మంజూరైన పింఛన్ నగదును అందజేశారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా పెన్షన్ నగదు పంచేందుకు తమ ఇళ్ల వద్దకు విచ్చేసిన సింధూరతో లబ్ధిదారులు ఆప్యాయంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ సింధూర మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి సమర్థవంతంగా ఇవ్వగల నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. నెల్లూరును స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్ద గల విజన్ మంత్రి నారాయణకే ఉందని ఘంటాపథంగా చెప్పారు. ఆ దిశగా వ్యూహాత్మకంగా మంత్రి నారాయణ అడుగులు వేస్తున్నట్లు తెలియజేశారు.
1 వ తేదీ ఆదివారం వచ్చిందని 31 వ తేదీనే పింఛన్లు ఇవ్వడం దేశ చరిత్రలో మొదటి సారి అని తెలిపారు. అధికారులు, నాయకులు సమన్వయంతో ఉదయం నుండే లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయడం హర్షించ దగ్గ విషయమని కొనియాడారు.
టీడీపీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీల మేరకు నెల్లూరులో త్వరలో అన్నీ పనులను పూర్తి చేస్తామని సింధూర భరోసా ఇచ్చారు.