అబ్కారీ శాఖ ఉక్కుపాదం: చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ, డిసెంబర్ 31,2024: ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించేందుకు చేపట్టిన కఠిన చర్యల ఫలితంగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ, డిసెంబర్ 31,2024: ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించేందుకు చేపట్టిన కఠిన చర్యల ఫలితంగా వివిధ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలిగామని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డిపిఎల్), నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిర్వహించిన దాడులు మంచి ఫలితాలు ఇచ్చాయని వెల్లడించారు.

గణాంకాల ప్రకారం:
2024 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు:

  • 14,539 కేసులు నమోదు: ఐడి మద్యం, బెల్లం ఉత్పత్తిపై
  • 6,157 అరెస్టులు: నిందితులపై చర్యలు
  • 1,68,185 లీటర్లు: ఐడి మద్యం స్వాధీనం
  • 61,09,472 లీటర్లు: బెల్లం ఊట ధ్వంసం
  • 381 వాహనాలు: సీజ్

ఎన్‌డిపిఎస్ మరియు నార్కోటిక్స్:

  • 8,681 కేసులు: ఎన్‌డిపిఎల్ మద్యం
  • 149 కేసులు: ఎన్‌డిపిఎస్
  • 362 అరెస్టులు
  • 4,983 కిలోల గంజాయి, 11.3 కిలోల ఓపియం గసగసాలు, 48 వాహనాలు: స్వాధీనం

అక్రమ కల్లు వ్యాపారం:

  • 266 కేసులు నమోదు
  • 58 మందిని అరెస్టు
  • 94 లీటర్ల కల్తీ కల్లు స్వాధీనం

ప్రత్యేక కార్యక్రమాలు:
రాహుల్ దేవ్ శర్మ నూతన సంవత్సరం సందర్బంగా మాట్లాడుతూ, అబ్కారీ శాఖ చర్యలు గణనీయమైన ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా అక్రమ మద్యం, నిషేధిత పదార్థాల వ్యాపారాలను అడ్డుకునేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ క్రమంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఎక్సైజ్ సంబంధిత నేరాలపై సమర్థమైన పర్యవేక్షణను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల కోసం టోల్-ఫ్రీ నంబర్ 14405 అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మద్యరహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో నవోదయం 2.0 పేరుతో ప్రత్యేక కార్యక్రమం అమలవుతుందన్నారు.

నూతన సంవత్సరం వేడుకలకు ప్రత్యేక అనుమతులు:
2025 జనవరి 1వ తేదీ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం దుకాణాలు, బార్‌ల పని వేళలను పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మద్యం విక్రయాలు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్‌లలో రాత్రి ఒంటిగంట వరకు కొనసాగవచ్చని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, ఐడీ మద్యం అమ్మకాలకు గట్టి నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

About Author