‘ప్రత్యేక ఈవెంట్‌లు, థ్రిల్లింగ్ అనుభవాలతో ఇంజనీర్స్ డే వేడుకలు: వండర్‌లా నుండి ఒకటి కొనండి, ఒకటి ఉచితంగా ఆఫర్’
వారాహి డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, సెప్టెంబర్ 12, 2024: భారతదేశంలోని అతి పెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ వండర్‌లా హాలిడేస్

వారాహి డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, సెప్టెంబర్ 12, 2024: భారతదేశంలోని అతి పెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్, ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజినీరింగ్ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు,ఐటిఐ సర్టిఫికేషన్ ఉన్నవారిని అభినందిస్తూ ప్రత్యేక ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా వండర్‌లా ఇంజనీర్ డే వేడుకలను సెప్టెంబర్ 15, 2024న నిర్వహిస్తుంది.
ఒకటి కొనండి ఒకటి ఉచితంగా పొందండి ఆఫర్:
వండర్‌లా బెంగళూరు,హైదరాబాద్ పార్కుల్లో టిక్కెట్లపై “ఒకటి కొనండి ఒకటి ఉచితంగా పొందండి” ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ని పొందడానికి ఆన్‌లైన్‌లో బుకింగ్ చేయడం తప్పనిసరి. ఆఫర్‌ను పొందేందుకు చెల్లుబాటు అయ్యే విద్యార్థి ఐడి లేదా ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్‌ను పార్క్ వద్ద ధృవీకరించాల్సి ఉంటుంది.

డీజే పార్టీ, స్పెషల్ ఈవెంట్స్:
ఈ ఇంజనీర్స్ డే వేడుకల్లో భాగంగా, స్పెషల్ డీజే పార్టీతో పాటు ఉత్కంఠభరితమైన రైడ్‌లు, ప్రత్యేక ఆహార ఆఫర్లు వంటివి సందర్శకులను మరపురాని అనుభవాలకు గురిచేస్తాయి.
వండర్‌లా మేనేజింగ్ డైరెక్టర్ వ్యాఖ్యలు:
“భవిష్యత్తును నిర్మించడంలో ఇంజినీర్లు చూపించిన అంకితభావం, కృషికి కృతజ్ఞతగా మేము ఈ ఆఫర్‌ని అందిస్తున్నాము. వారు విశ్రాంతి తీసుకుని తమ మిత్రులతో ఆనందంగా గడపడం కోసం ఈ వేడుకలతో ఒక అవశరం సృష్టిస్తున్నాము,” అని వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలపిల్లి అన్నారు.
టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి:
సందర్శకులు ఆన్‌లైన్ పోర్టల్ https://bookings.wonderla.com/ ద్వారా తమ టిక్కెట్లు ముందుగా బుక్ చేసుకోవాలని వండర్‌లా ప్రోత్సహిస్తోంది.

సంప్రదించడానికి:
బెంగళూరు పార్క్: +91 80372 30333 లేదా +9945557777
హైదరాబాద్ పార్క్: 084 146 76333 లేదా +91 91000 63636