విశాఖపట్నంలోని అన్నా క్యాంటీన్లో భోజనం చేసిన దర్శకుడు అమ్మ రాజశేఖర్,కమెడియన్ అవినాష్, హీరో రాగిణి రాజ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 6,2025: విశాఖపట్నం: పేదల కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్న క్యాంటీన్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 6,2025: విశాఖపట్నం: పేదల కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్న క్యాంటీన్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. రామా టాకీస్ అంబేద్కర్ భవనం వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో ప్రముఖ దర్శకుడు అమ్మ రాజశేఖర్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్, అలాగే హీరోగా పరిచయం అవుతున్న రాగిణి రాజ్ మధ్యాహ్న భోజనం కోసం క్యూలో నిలబడి టోకెన్ తీసుకున్నారు. అనంతరం సామాన్య ప్రజలతో కలిసి సంతోషంగా అన్న క్యాంటీన్లో ఆహారం తీసుకున్నారు.
ఈ సందర్భంగా, దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ, “నా కుమారుడు రాగిణి రాజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘తల’ చిత్రం ప్రమోషన్ కోసం విశాఖపట్నంలో ఉన్నాము. మధ్యాహ్నం ఆకలిగా ఉన్న సందర్భంలో, రామా టాకీస్ రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ వద్ద భోజనం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం పేదలకు నాణ్యమైన ఆహారం అందించడం గొప్ప విషయమే” అని తెలిపారు.
అవినాష్ మాట్లాడుతూ, “ప్రభుత్వం పేదలకు నాణ్యమైన ఆహారం అందిస్తుందని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు, నేను కూడా అన్న క్యాంటీన్లో భోజనం చేయగలిగానని మర్చిపోలేను. ఈ అనుభవం నాకు చాలా ప్రత్యేకమైనది” అని అన్నారు.
హీరో రాగిణి రాజ్ మాట్లాడుతూ, “అన్న క్యాంటీన్లో భోజనం చేయడం నాకు చాలా ఆనందం ఇచ్చింది. ప్రభుత్వంలో పేదలకు మంచి ఆహారం అందించడం నిజంగా గర్వించదగిన విషయం. నేను నటించిన ‘తల’ చిత్రం ఈనెల 14న విడుదల కాబోతున్నది. ఈ చిత్రం కోసం ప్రజలు ఆతిథ్యం చూపాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.