దేవత విగ్రహం ధ్వంసం దుర్మార్గం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 16,2024:సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం ఆవేదనకు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 16,2024:సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం ఆవేదనకు గురి చేసింది. ఇది దుర్మార్గం. మహాపచారం. దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలను ఏ మతానికి సంబంధించిన వారైనపట్టికీ సామూహికంగా కాపాడుకోవాలి. ఈ బాధ్యతను ప్రభుత్వాలు మీదనో, పోలీసుల మీదనో వేసి మనం బాధ్యత నుంచి దూరంగా ఉండరాదు.
గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూశాను. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలను అపవిత్రం చేయడం అలవాటుగా మారింది.

ఇలాంటి సంఘటనలను చూసీ చూడనట్లు వదిలేస్తే అది విపరీత పోకడలకు దారి తీస్తుంది. అదుపు తప్పుతుంది. ఇటువంటి దుర్మార్గాలపై చాలా బలమైన చర్యలు అవసరం. అందుకే తిరుపతిలో జరిగిన సభలో వారాహి డిక్లరేషన్ లో చెప్పాను. ఇటువంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.