డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగం: చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, ఐఏఎస్ అధికారుల బాధ్యత
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 11,2024: చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఎటువంటి సందేహం లేదు.
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 11,2024: చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఎటువంటి సందేహం లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
రాష్ట్రానికి గూగుల్ వచ్చేందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మూలాలను పూర్తిగా నాశనం చేసింది.
భారీ అవకతవకలకు పాల్పడింది. మనపై పెద్ద బాధ్యత వేసారు. మేము పాలసీలను మాత్రమే రూపొందించగలుగుతాం. క్షేత్రస్థాయిలో వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్ అధికారులే. గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు విక్రయించేందుకు ఆదేశాలు ఇచ్చారు.
అంతేకాదు, ఎన్నో అన్యాయాలకు పాల్పడ్డారు. ఇంతమంది ఐఏఎస్ ఉన్నా, వారు ఏమీ చేయలేని స్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. నేడు ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. ఇంతటి సంక్షోభంలోనూ సమర్థమైన పాలనను అందించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైంది.
రాళ్లు, రప్పలున్న ప్రదేశంలో చంద్రబాబు సైబరాబాద్ లాంటి ప్రపంచ స్థాయి నగరాన్ని సృష్టించారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టం. మీ అందరి సహకారంతో ప్రజా పాలన అందించాలని మేము కోరుకుంటున్నాం. కాకినాడ పోర్టులో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా, బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు.
సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల కారణంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. మంత్రి మనోహర్ తనిఖీలకు వెళ్ళినప్పుడు, సహకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా? పాలన అంటే ఏపీలో జరుగుతున్నట్లుగా దేశమంతా అనుకోవాలి. అందుకు ఐఏఎస్ అధికారులే బాధ్యత తీసుకోవాలి.