సుంకరమెట్టలో చెక్క వంతెన ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అరకు, ఏప్రిల్ 8,2025:అరకు మండలంలోని సుంకరమెట్ట కాఫీ ఎస్టేట్స్‌లో నిర్మించిన చెక్క వంతెనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అరకు, ఏప్రిల్ 8,2025:అరకు మండలంలోని సుంకరమెట్ట కాఫీ ఎస్టేట్స్‌లో నిర్మించిన చెక్క వంతెనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.19 లక్షల వ్యయంతో కాఫీ తోటల మధ్య ఏర్పాటు చేసిన ఈ చెక్క వంతెనను పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇది కూడా చదవండి...వాలంటీర్ల పేరుతో గత పాలకులు వంచించారు :పవన్ కళ్యాణ్

ఇది కూడా చదవండి...కురుడి శివాలయంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

వంతెన ప్రారంభానికి ముందు, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఆర్.వి. సుజయకృష్ణ రంగారావుతో కలిసి పవన్ కళ్యాణ్ మొక్కలు నాటి హరితహారంలో భాగస్వామ్యం అయ్యారు. అనంతరం చెక్క వంతెనపై కెనోపీ వాక్ ప్రారంభించి, తోటల మధ్య నడుచుకుంటూ అక్కడి పరిస్థితులను అధికారులతో తెలుసుకున్నారు.

సిల్వర్ ఓక్ చెట్ల మధ్య సాగుతున్న కాఫీ మొక్కలు, ఎత్తైన చెట్లపైకి ఎక్కిన మిరియాల సాగు, పక్షి గూడు ఆకారంలో ఏర్పాటు చేసిన బర్డ్ నెస్ట్‌లు, ట్రీడెక్స్ వేదికలు ఆయనను ఆకట్టుకున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, టూరిజం అభివృద్ధికి అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా అరకు డిలైట్ కాఫీ బ్రాండ్ ప్రచారాన్ని ప్రారంభించారు. అలాగే సుంకరమెట్ట ఎకో టూరిజం పోస్టర్లు, బ్రోచర్లు విడుదల చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటో గ్యాలరీను సందర్శించారు.

Read this also…Pawan Kalyan Orders Probe Over Alleged Traffic Delay for JEE Students

ఇది కూడా చదవండి...సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం… పవన్ కుమారుడు ఆసుపత్రిలో

ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ డా. రాజేంద్రప్రసాద్ కజూరియా, విశాఖ రీజియన్ ఫారెస్ట్ చీఫ్ కర్జర్వేటర్ డా. జ్యోతి తుల్లిమెల్లి, జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్, గ్రామ సర్పంచ్ గెమ్మిలి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author