ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్యపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 4,2025: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్యపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 4,2025: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్యపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని అభివర్ణించారు. నాగాంజలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది,’’ అని పవన్ తెలిపారు.

ఇది కూడా చదవండి..తహసీల్దార్ కార్యాలయం, వాటర్ వర్క్స్, అన్న క్యాంటిన్ ప్రారంభించిన నాగబాబు

ఇది కూడా చదవండి..మనోజ్ కుమార్ మృతిపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం

ఇంటర్న్‌గా కిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నాగాంజలి తన సూసైడ్ నోట్‌లో డాక్టర్ దువ్వాడ దీపక్‌ను కారకుడిగా పేర్కొనడంతో అతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసుల వివరాలను ఆయన ఉటంకించారు. ‘‘చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు’’ అని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో విద్యార్థినులు, యువతుల రక్షణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని, ఇలాంటి ఘటనలు జరిగితే పోలీసు వ్యవస్థ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత కుటుంబాల భావోద్వేగాలను అర్థం చేసుకొని చర్యలు చేపట్టాలన్నారు.

ఇది కూడా చదవండి..గొల్లప్రోలులో నూతన అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ నాగబాబు

ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడితే తోటి విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతారని చెప్పారు. కోల్‌కతాలో జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటన ఉదాహరణగా పేర్కొన్నారు. విద్యార్థులైన యువతికి భరోసా, ధైర్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. ఈ అంశంపై అనుసరించాల్సిన చర్యలపై రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి తానేటి అనితకు, డీజీపీకి సూచనలు అందజేస్తానన్నారు.

About Author