రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో రోడ్డు నిర్మాణం పరిశీలన
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 10,2025: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన కోసం రాజమండ్రి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 10,2025: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన కోసం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం వైపు బయలుదేరారు. రాజానగరం, సామర్లకోట మీదుగా, ఏడీబీ రోడ్డు నుంచి పిఠాపురం చేరుకుంటారు.
ఈ పర్యటనలో ఆయన్ని స్వాగతించేందుకు ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, పార్టీ నాయకులు వై.శ్రీనివాస్, శ్రీమతి గంటా స్వరూప, శ్రీమతి కడలి ఈశ్వరి, తలాటం సత్య తదితరులు ఉన్నారు.
ఈ నియోజకవర్గ పర్యటనలో, ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గోకులాలను ప్రారంభించి, అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. విమానాశ్రయంనుంచి పిఠాపురం బయలుదేరే మార్గంలో రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ పనుల ప్రారంభం ఎప్పుడయ్యింది, ఎంత వరకు పూర్తయింది, ప్రస్తుతంగా పనులు ఎలా జరుగుతున్నాయి అన్న వివరాలను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి, ఇతర అధికారులు అడిగి తెలుసుకున్నారు.
అయన రోడ్డు వెంట నడిచిపోతూ, డ్రెయిన్ సౌకర్యం, నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించారు. అలాగే, ఇటీవల గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా వడిశలేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రెండు అభిమానుల ప్రదేశాన్ని కూడా సందర్శించారు.
ఈ ప్రమాదానికి కారణములు ఏమిటి అన్న విషయాన్ని అధికారులు అడిగి తెలుసుకున్నారు.
కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ,ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.