కడప జిల్లాలో 40 ఏళ్లుగా అన్నదానం చేస్తున్న ఆశ్రమం కూల్చివేత
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 13,2025: అటవీశాఖ చర్యలతో భక్తుల్లో ఆగ్రహం :కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం, కాశీనాయన మండలంలోని కాశీనాయుని జ్యోతి క్షేత్రంలో 40 ఏళ్లుగా ఉచిత అన్నదానం నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 13,2025: అటవీశాఖ చర్యలతో భక్తుల్లో ఆగ్రహం :కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం, కాశీనాయన మండలంలోని కాశీనాయుని జ్యోతి క్షేత్రంలో 40 ఏళ్లుగా ఉచిత అన్నదానం నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది.
ఈ క్షేత్రాన్ని 1995లో సమాధి చెందిన అవధూత కాశీ నాయన స్థాపించగా, అప్పటి నుంచే ఇక్కడ నిరంతర అన్నదానం కొనసాగుతోంది. కుల, మత భేదాలను లేకుండా ప్రతి భక్తునికీ ఆకలినీహారించే ఈ సేవాకార్యక్రమం లక్షలాది మందికి ఉపశమనం కలిగించింది.
Read this also…Tata AIA Delivers Superior Fund Performance Across ULIP Offerings
ఇది కూడా చదవండి…యాక్సిస్ నిఫ్టీ500 మొమెంటం 50 ఈటీఎఫ్ విడుదల.
అటవీశాఖ చర్యలతో వివాదం
నల్లమల అడవుల్లోని ఈ క్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉందని పేర్కొంటూ అటవీశాఖ అధికారులు ఆశ్రమంపై బుల్డోజర్లు నడిపించారు. ఈ క్రమంలో రజకులు, కుమ్మరులు నిర్మించిన సత్రాలను కూడా నేలమట్టం చేశారు. ఇదే సమయంలో 500 గోవులతో నడుస్తున్న గోశాలను కూడా తరలించారు.
ఈ ఘటన హిందూ భక్తుల ఆగ్రహానికి దారితీసింది. “సనాతన ధర్మాన్ని కాపాడతానంటూ ప్రకటించే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని అటవీశాఖ ఈ కూల్చివేతలు చేయడం బాధాకరం” అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నాలు
ఈ ఘటనపై భక్తులు, వివిధ హిందూ సంఘాలు తీవ్రంగా నిరసన తెలియజేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు దిగింది. మంత్రి లోకేష్ “జరిగిన పొరపాటుకు చింతిస్తున్నా. నా స్వంత నిధులతో తిరిగి నిర్మిస్తా” అని హామీ ఇచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి కూడా “ఈ ప్రాంతం టైగర్ జోన్ పరిధిలో ఉండటంతో అధికారులు అనుకోకుండా చర్యలు తీసుకున్నారు. దీనిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది” అని తెలిపారు.
ఇదే అంశంపై హిందూ మఠాధిపతులు, ప్రముఖులు స్పందించారు. అన్నమాచార్య పీఠాధిపతి విజయ శంకర స్వామి, అచలానంద ఆశ్రమ పెద్దలు ఈ ప్రాంతాన్ని సందర్శించి భక్తులకు మద్దతుగా నిలిచారు. ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్ ఎదుట వేలాది మంది భక్తులు నిరసన తెలుపనున్నట్లు విజయ శంకర స్వామి ప్రకటించారు.
ఉపముఖ్యమంత్రిపై విమర్శలు

ఈ అంశంపై హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని అటవీ శాఖ కూల్చివేతలు జరిపినప్పటికీ, ఆయన ఇప్పటివరకు స్పందించకపోవడం హిందూ భక్తుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. “తిరుపతి లడ్డూ ప్రసాదం అంశంపై దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఇక్కడ మౌనం ?” అని ప్రశ్నిస్తున్నారు.
Read this also…Axis Mutual Fund Launches ‘Axis Nifty500 Momentum 50 ETF’
Read this also…Tata Power & NSDC Partner to Strengthen Skill Development in India’s Power Sector
ఈ పరిణామాలు హిందుత్వ-కార్పొరేట్ సంబంధాన్ని మరోసారి ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. “అరణ్యాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు గిరిజనులను తరిమివేయడం, హిందూ క్షేత్రాలను తొలగించడం దేనికి సంకేతం?” అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వివాదంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.