ఎం.డి  & సీఈఓ గా ఎస్ శంకరసుబ్రమణియన్‌కు పదోన్నతి కల్పించిన కోరమాండల్ ఇంటర్నేషనల్

0

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,8 ఆగస్టు 2024: కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సిఐఎల్) డైరెక్టర్ల బోర్డు ఈ రోజు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా న్యూట్రియంట్ బిజినెస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  ఎస్ శంకరసుబ్రమణియన్‌ను నియమించినట్లు వెల్లడించింది. ఈ నియామకం  7 ఆగస్టు 2024 నుండి అమలులోకి వచ్చింది.

శ్రీ  శంకరసుబ్రమణియన్ తనతో పాటు అపారమైన అనుభవాన్ని తీసుకువచ్చారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్,బిజినెస్ హెడ్‌గా ఆయన నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి గణిత శాస్త్ర గ్రాడ్యుయేట్ అయిన శంకరసుబ్రమణియన్,   ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సభ్యులు .  2009 సంవత్సరంలో ఆయన  హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (ఏఎంపి) పూర్తి చేశారు.

మురుగప్ప గ్రూప్‌తో ఆయన అనుబంధం 1993 లో ప్రారంభమైనది. ఆయన కార్పొరేట్ ఫైనాన్స్‌లో E.I.D ప్యారీ (ఇండియా) లిమిటెడ్‌లో తన కెరియర్ ను ప్రారంభించారు, అక్కడ ఆయన వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నత స్థాయిలకు చేరుకున్నారు, 2003లో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో చేరారు.

న్యూట్రియంట్ విభాగంలో బిజినెస్ హెడ్‌గా ఉన్న ఈయన పదవీ కాలంలో,  పరిశ్రమలో తన స్థానాన్ని కోరమాండల్ సుస్థిరం చేసుకుంది.లాభదాయకంగా అభివృద్ధి చెందింది. నానో టెక్నాలజీ,డ్రోన్ స్ప్రేయింగ్ సేవలతో పాటు మైనింగ్ కార్యకలాపాల్లోకి కూడా  ప్రవేశించడం ద్వారా  కొత్త ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలలోకి విస్తరించింది.

ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ట్యునీషియా ఇండియన్ ఫెర్టిలైజర్ ఎస్.ఏ., ట్యునీషియా, దక్షిణాఫ్రికాలోని ఫోస్కోర్ (Pty) లిమిటెడ్ తో పాటుగా కంపెనీ కొన్ని అనుబంధ సంస్థల  బోర్డులలో కూడా ఆయన తన సేవలను అందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *