పంచాయతీల సమస్యల పరిష్కారానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అరకు, ఏప్రిల్ 8,2025: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అరకు, ఏప్రిల్ 8,2025: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం అరకులో ఆయనను కలిసిన ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పలు అంశాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

గ్రామ పంచాయతీలపై విద్యుత్ బిల్లుల భారం పెరిగినట్లు, మైనర్ పంచాయతీలకు ఉచిత విద్యుత్ పునరుద్ధరణ అవసరమని కోరిన వారిని పవన్ కళ్యాణ్ ఓపికతో విన్నారు. విద్యుత్ బిల్లుల పేరుతో గత ప్రభుత్వ హయాంలో అకౌంట్లు ఖాళీ చేసిన ఘటనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి...సుంకరమెట్టలో చెక్క వంతెన ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఇది కూడా చదవండి...వాలంటీర్ల పేరుతో గత పాలకులు వంచించారు :పవన్ కళ్యాణ్

సమస్యలను మంత్రివర్గ సమావేశాల్లో చర్చించి పరిష్కార మార్గాలు చూస్తామని హామీ ఇచ్చారు.

గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రత్యేక దృష్టి :
గిరిజన గూడెం, తాండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి నిధులు కేటాయించాలని వినతిపత్రాలు అందించారు. గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ సహాయం రూ.5 లక్షలకు పెంచాలన్న సూచనపై సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పెంపుపై త్వరలోనే గిరిజన సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు.

అంతేకాకుండా, 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్రం నుంచి మంజూరవాల్సిన నిధుల విడుదల అంశాల్లోనూ సహకారం అందించేందుకు సిద్ధమని వెల్లడించారు.

Read this also…Pawan Kalyan Orders Probe Over Alleged Traffic Delay for JEE Students

ఇది కూడా చదవండి...కురుడి శివాలయంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

ఈ సమావేశంలో సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు, సర్పంచులు పాంగి సునీత సురేష్, పెట్టెలి సునీత, పెట్టెలి దాసుబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author