ఆర్యజనని ఆధ్వర్యంలో నకిరేకల్‌లో గర్భిణీలకు అవగాహనా కార్యక్రమం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 9, 2024 : నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌లో ఆర్యజనని నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 9, 2024 : నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌లో ఆర్యజనని నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. సుమారు 250 మంది గర్భిణీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు అంశాలపై వారికి అవగాహన కల్పించింది ఆర్యజనని టీమ్.

ఈ సెషన్‌లో ప్రినేటల్ అవేర్‌నెస్, యోగా, భజనలు, గైడెడ్ మెడిటేషన్, ప్రెగ్నెన్సీ లైఫ్‌స్టైల్ మొదలైన వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్యఅతిథిగా హాజరై ఆర్యజనని సేవలను అభినందించారు.

ఆర్యజనని బృందంలో డాక్టర్ అనుపమ, నిహారిక, మాధవి, రాజేశ్వరి తదితరులు ఉన్నారు. కార్యక్రమం అనంతరం ఆర్యజనని ఆధ్వర్యంలో గర్భిణులకు, హాజరైన వారికి ఖర్జూరం పంపిణీ చేశారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన రామకృష్ణ సేవా సమితి, అంగన్‌వాడీ టీచర్లు, స్థానికులకు దశరథ్ ధన్యవాదాలు తెలియజేశారు.

About Author