అమాత్యుడి కృషిక్షేత్రాన కుడ్య చిత్రాలు …శిల్పాలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 21,2024:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 21,2024:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖలు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలోని తన ప్రైవేట్ క్యాంప్ కార్యాలయంలో తన శాఖలకు సంబంధించిన అంశాలపై మినియేచర్ శిల్పాలు, చిత్రాలు ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా శాస్త్ర సాంకేతిక విభాగం పరిధిలోకి వచ్చే అంశాలతో బొమ్మలు ప్రత్యేకంగా చేయించారు. ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ రాకెట్రీ అనే థీమ్ తో మన దేశ అంతరిక్ష పరిశోధన ప్రస్థానాన్ని తెలిపేలా ఆ బొమ్మలు, లోహంతో చేసిన మినియేచర్ శిల్పాలు ఉన్నాయి.

ఇస్రో ప్రస్థానం మొదలయినప్పుడు శాస్త్రవేత్తలు తమ పరిశోధనకు అవసరమైన వాటిని సైకిల్ మీద, ఎడ్ల బండ్ల మీద తీసుకువెళ్లే బొమ్మల నుంచి నేటి చంద్రయాన్, మంగళయాన్ వరకూ సాధించిన ఘనతను తెలిపేలా ఆ శిల్పాలు ఉన్నాయి.

బెంగళూరుకు చెందిన క్రాఫ్టిజన్ అనే సంస్థకు తన ఆలోచనలు తెలియచేసి వాటిని రూపొందింపచేయించారు పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించిన అంశాలను తెలియచేసేలా కార్యాలయంలో ఒక పక్క గోడ చిత్రాలు, కొయ్య శిల్పాలతో అలంకరించాలని సంబంధిత నిపుణులకు నిర్దేశించారు.

About Author