మన్యం వీరుడి పోరాట చరిత్ర భావితరాలకు తెలియజేయాలి: పవన్ కల్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 7,2025: బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 7,2025: బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జీవిత చరిత్ర భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత మనందరిదని పేర్కొన్నారు.

‘‘మన చుట్టూ ఉన్న నిరుపేదలు, అణగారిన వర్గాల పట్ల బాధ్యతగా ఎలా ఉండాలో అల్లూరి గారి జీవితం స్పష్టం చేస్తుంది. మన్యం గిరిజనుల్లో చైతన్యం నింపి, అన్యాయానికి తలొగ్గకుండా పోరాడే ధైర్యాన్ని అందించిన యోధుడు ఆయన.

బ్రిటిష్ పాలకులపై తాను నమ్మిన మార్గంలో సాయుధంగా ఎదిరించిన వీరుడు. ప్రతి సారి మన్యం ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆయన పోరాట గాధలు మదిలో మోగుతాయి. అలాంటి పోరాట చరిత్రను భావితరాలకు చేరవేయడమే నిజమైన నివాళి,’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

About Author