‘కమిటీ కుర్రోళ్లు’ విజయం తర్వాత నిహారిక కొణిదెల కొత్త సినిమా – సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఏప్రిల్ 2,2025: ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఏప్రిల్ 2,2025: ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటుల్లో ఎక్కువ మంది కొత్తవారే కావటం విశేషం.

తాజాగా నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ప్రతిభావంతుడైన యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు రానున్న రోజుల్లో వెల్లడికానున్నాయి.

Read this also…Niharika Konidela’s Next: Sangeeth Shoban Leads

Read this also…Raymond Limited Signs 6th Major Joint Development Agreement for Residential Project in Wadala, Mumbai

ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు.

తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ రూపొందించనున్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఆంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్రలో నటించారు.

ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) పిఆర్వోగా, టికెట్ ఫ్యాక్టరీ మార్కెటింగ్ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు.

HD Pics & Posters – https://drive.google.com/drive/folders/1Ccl6etjSB97sxXdZDO1qx-p4kw0qwnB4?usp=sharing

Read this also…L&T Secures Major Orders for Power Transmission & Distribution Business

ఇది కూడా చదవండి..“రామ్ చ‌ర‌ణ్ ‘పెద్ది’ ఫ‌స్ట్ షాట్: శ్రీ రామ న‌వ‌మి సందర్భంగా ఏప్రిల్ 6న‌ విడుదల!”

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.2 ( #PEP2 )

బ్యానర్ – పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
నటీనటులు- సంగీత్ శోభన్
కథ – మానస శర్మ
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – మహేష్ ఉప్పాల, మానస శర్మ
దర్శకత్వం – మానస శర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్
ప్రొడ్యూసర్ – నిహారిక కొణిదెల
పి.ఆర్.ఒ – సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్ – టికెట్ ఫ్యాక్టరీ

About Author

You may have missed