ఆపిల్ స్టోర్ లో ఐఫోన్ చోరీ చేసేందుకు పళ్లతో కేబుల్ ను కట్ చేసిన మహిళ..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 3,2023: ఐఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతారు. ఇది అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ప్రతిఒక్కరూ ఈ స్మార్ట్ ఫోన్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 3,2023: ఐఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతారు. ఇది అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ప్రతిఒక్కరూ ఈ స్మార్ట్ ఫోన్ ఉంటే బాగుండు అని ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమంది దానిని దొంగిలించడానికి కూడా వెనకాడరు.
గతంలో కూడా యాపిల్ స్టోర్ల నుంచి ఐఫోన్ చోరీకి గురైన ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అలాంటిదే మరొకటి జరిగింది. ఒక మహిళ ఐఫోన్ 14ని దొంగిలించడానికి స్టోర్ సెక్యూరిటీ కేబుల్‌ను నోటితో కొరికింది. అయితే చోరీ జరిగిన కొద్దిసేపటికే మహిళ పట్టుపడింది.

సెక్యూరిటీ కేబుల్ ను నోటితో కట్ చేసేందుకు యత్నించిన మహిళ ఎవరికీ అనుమానం రాకుండా ఓ కష్టమర్ లా ఫోన్ స్క్రోల్ చేస్తున్నట్లు నటించింది.
చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌కు చెందిన “క్యూ” అనే మహిళ ఆపిల్ స్టోర్ నుంచి ఐఫోన్ 14 ప్లస్ ను దొంగిలించేందుకు యత్నించింది. సదరు మహిళ స్టోర్‌లోని సెక్యూరిటీ కేబుల్‌ను నోటితో కొరికింది.
“క్యూ” Qiu డిస్ప్లే స్టాండ్ ముందు ఆగి, ఫోన్‌పై చేయి వేయడానికి కౌంటర్‌పైకి వంగి ఉంది. ఆమె పరికరాన్ని పరిశీలించి, దానిని సురక్షితంగా ఉంచడానికి పరికరానికి జోడించిన సెక్యూరిటీ కేబుల్‌ను కొరకడం ప్రారంభించింది.
కేబుల్ ని పూర్తిగా డిస్‌కనెక్ట్ చేసి, ఫోన్‌ని బ్యాగ్‌లో పెట్టుకుని దుకాణం నుంచి బయటకు వెళ్లింది. కేబుల్ కట్ చేసేందుకు ప్రయత్నించగా, క్యూ సాధారణ కస్టమర్‌లా ఫోన్‌లో స్క్రోల్ చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా నటించింది.
అయితే ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చైనాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ దొంగిలించిన ఫోన్ విలువ 7,000 చైనీస్ యువాన్ అంటే సుమారు రూ. 79,749.
అరగంట వ్యవధిలోనే పట్టుపడింది..

దొంగతనం సమయంలో అలారంమోగింది. అయితే సదరు మహిళ వద్దకు వెళ్లగా ఏమీ కనిపించకపోవడంతో సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళ తన బ్యాగ్‌లో ఐఫోన్‌తో స్టోర్ నుంచి బయటకువెళ్లగా, స్టోర్ ఉద్యోగులు ఐఫోన్ కనిపించకుండా పోయిందని గుర్తించారు.
ఆమె కేబుల్ కూడా కట్ చేసిందని కూడా గమనించారు. ఆ తర్వాత పోలీసులు అప్రమత్తమవ్వడంతో దొంగతనం జరిగిన 30 నిమిషాలకే ఆ మహిళను పట్టుకున్నారు.