ఐ.ఎస్. జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏలూరు జిల్లా, నవంబర్ 24,2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏలూరు జిల్లా, నవంబర్ 24,2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని కనకవల్లీ సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.

పూర్ణకుంభ స్వాగతం అనంతరం స్వామివారికి పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్, ఆలయ ప్రదక్షిణ చేసి గర్భగుడిలో దర్శనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా ఐ.ఎస్. జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్థలపురాణం పుస్తకాన్ని ఉపముఖ్యమంత్రి అధికారికంగా ఆవిష్కరించారు.

ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి కొండపైకి చేరుకున్నారు.

సందర్శనలో భాగంగా ప్రభుత్వ విప్‌లు బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మడి నాయకర్, ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణ (చోడవరం), పత్సమట్ల ధర్మరాజు, పులపర్తి రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

పొంగుటూరు-లక్కవరం రోడ్డు పరిశీలన
గతేడాది తాను సందర్శించినప్పుడు ప్రజలు చెప్పిన ఫిర్యాదు మేరకు రూ.1.5 కోట్లతో 6.5 కి.మీ. మేర పొంగుటూరు-లక్కవరం రోడ్డుకు మరమ్మతులు పూర్తి చేయించిన సంగతి తెలిసిందే.

ఈ రోడ్డును మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఈరోజు నేరుగా పరిశీలించి, ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రహదారిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

About Author