ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,10,250 కోట్ల భారీ పెట్టుబడి గ్రీన్ ఎనర్జీ రంగంలో..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, నవంబర్ 14, 2025:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, నవంబర్ 14, 2025:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏబీసీ క్లీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎవ్రెన్), యాక్సిస్ ఎనర్జీతో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,10,250 కోట్ల అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఈ భారీ పెట్టుబడితో రాష్ట్రంలో కింది ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి:
- 6,500 మెగావాట్ల పవన విద్యుత్తు
- 6,500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు
- 6,500 మెగావాట్ గంటల ఎనర్జీ స్టోరేజ్
- 0.25 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్
- 1 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పన్నాలు

ఈ ఒప్పందంపై NREDCAP వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. కమలాకర్ బాబు, ఎవ్రెన్ చైర్మన్ కటారు రవి కుమార్ రెడ్డి, యాక్సిస్ ఎనర్జీ సీఈఓ ఎస్. సంతకాలు చేశారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు:
- ఏపీ డిస్కామ్‌లకు పునరుత్పాదక ఇంధన వాటా పూర్తి చేయడం
- రాష్ట్రంలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మానుఫాక్చరింగ్ పరిశ్రమలకు స్థిరమైన, పరిశుభ్రమైన విద్యుత్తు సరఫరా
ఈ భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడమే కాకుండా, భారత్ డీకార్బనైజేషన్ లక్ష్యాలకు కీలక దోహదం చేయనుంది.