2035 నాటికి ఏరోస్పేస్‌ను కొత్తగా తీర్చిదిద్దనున్న ఏఐ, డిజిటల్ ట్విన్స్: టీసీఎస్ అధ్యయనంలో వెల్లడి..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, సెప్టెంబర్ 12, 2025: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిర్వహించిన ఫ్యూచర్-రెడీ స్కైస్ స్టడీ 2025 ప్రకారం, 2035 నాటికి విమాన తయారీలో
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, సెప్టెంబర్ 12, 2025: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిర్వహించిన ఫ్యూచర్-రెడీ స్కైస్ స్టడీ 2025 ప్రకారం, 2035 నాటికి విమాన తయారీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రియల్-టైమ్ నిర్ణయాధికారంలో కీలక పరివర్తనలను తీసుకొస్తుందని ప్రతి ముగ్గురు ఏరోస్పేస్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు అభిప్రాయపడ్డారు.
ఏరోస్పేస్ కంపెనీలు డిజిటల్ ఆధారిత, ఏఐ-శక్తితో కూడిన తయారీ, నిర్వహణ, మొబిలిటీ, ,సరఫరా వ్యవస్థల భవిష్యత్తు కోసం ఎలా సన్నద్ధమవుతున్నాయో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం నిర్వహించబడింది.
ఈ నివేదిక పరిశ్రమలో తెలివైన, పర్యావరణ హితమైన కార్యకలాపాల నిర్వహణపై కంపెనీలు పెట్టుబడులు పెంచుతున్న నేపథ్యంలో పరిశ్రమ ధోరణులను విశ్లేషిస్తుంది. సగటున 60 శాతం ఏరోస్పేస్ నాయకులు తయారీ ప్రక్రియల్లో మానవ నైపుణ్యాలు కీలకంగా కొనసాగుతాయని భావిస్తున్నారు, ఇది మానవ అనుభవం,ఏఐ కలిసి పనిచేసే హైబ్రిడ్ భవిష్యత్తును సూచిస్తుంది.
ఏజెంటిక్ ఏఐని సరఫరా వ్యవస్థల నిర్వహణకు వినియోగించడంపై 63 శాతం ఎగ్జిక్యూటివ్‌లు సానుకూలంగా ఉన్నారు, అయితే ప్రస్తుతం కేవలం 6 శాతం మంది మాత్రమే దీనిని అమలు చేస్తున్నారు.

కీలక అంశాలు:
- సరఫరా వ్యవస్థలలో ఏఐ: 63 శాతం ఏరోస్పేస్ ఎగ్జిక్యూటివ్‌లు సరఫరా వ్యవస్థల నిర్వహణకు ఏజెంటిక్ ఏఐని ఉపయోగించాలని భావిస్తున్నారు, కానీ ప్రస్తుతం 6 శాతం మంది మాత్రమే దీనిని వినియోగిస్తున్నారు, సన్నద్ధత, అమలు మధ్య అంతరాన్ని సూచిస్తుంది.
- తయారీలో ఆటోమేషన్: వచ్చే 5-7 ఏళ్లలో కేవలం 40 శాతం తయారీ కార్యకలాపాలు మానవ జోక్యం తక్కువగా ఉండే ‘లైట్స్ అవుట్’ ఆటోమేషన్‌గా ఉండవచ్చని రెస్పాండెంట్లు అంచనా వేశారు.
- పెట్టుబడుల రాబడి: 51 శాతం ఎంఆర్‌వో ప్రొవైడర్లు అధునాతన టెక్నాలజీలపై పెట్టుబడులు 5 ఏళ్లలో ఫలితాలను ఇస్తాయని, 64 శాతం మంది ప్రెడిక్టివ్ అనలిటిక్స్ , ఏజెంటిక్ ఏఐ కొలవగల ఆర్‌వోఐని అందిస్తాయని భావిస్తున్నారు.
- అర్బన్ ఎయిర్ మొబిలిటీ: 34 శాతం ఏఏఎం కంపెనీలు ప్రజామోదం ప్రధాన అడ్డంకిగా భావిస్తున్నాయి, అయితే 70 శాతం సంస్థలు కమర్షియల్ ప్లాట్‌ఫాంలను రూపొందిస్తున్నాయి.
- డిజిటల్ ఎంఆర్‌వో: కేవలం 5 శాతం ఎంఆర్‌వో ఎగ్జిక్యూటివ్‌లు తమ డిజిటల్ వ్యూహాలను తగినంతగా విస్తరించినట్లు తెలిపారు. 80 శాతం మంది వచ్చే మూడేళ్లలో విస్తరణ విఫలమైతే నిర్వహణ వ్యయాలు, డౌన్‌టైమ్ పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
- డిజిటల్ థ్రెడ్: 59 శాతం తయారీ సంస్థలు పాక్షికంగా డిజిటల్ థ్రెడ్ ఇంటిగ్రేషన్‌ను అమలు చేస్తున్నాయి, అయితే పూర్తి స్థాయి సమన్వయం ఇంకా సుదూరంగా ఉంది.
ఏరోస్పేస్‌లో ఏఐ,డిజిటల్ ట్విన్స్ పాత్ర
Read This also…TCS and CEA Collaborate to Advance Physical AI Innovation in France..
ఏఐ ఫలితాలు డేటా యొక్క ఖచ్చితత్వంపై ఆధారపడతాయని, ప్రస్తుతం ఏరోస్పేస్ పరిశ్రమ కీలక దశలో ఉందని స్టీవ్ లూకాస్, బూమి చైర్మన్,సీఈవో తెలిపారు. “విశ్వసనీయ డేటా పునాదులపై ఏజెంటిక్ ఏఐ విజయవంతమవుతుంది.
సంక్లిష్ట వ్యవస్థలను సమన్వయపరచడం ద్వారా కంపెనీలు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు ,ఆవిష్కరణలను విస్తృతంగా చేపట్టగలవు,” అని ఆయన అన్నారు.

“ఏరోస్పేస్ పరిశ్రమలో ఖచ్చితత్వం,భద్రత ప్రధాన లక్ష్యాలు. ఏఐ ప్రయాణీకులకు మెరుగైన అనుభవం, భద్రత, సుస్థిరతను వినూత్నంగా తీర్చిదిద్దే స్థాయికి ఎదిగింది. టీసీఎస్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, సాహసోపేతమైన, పరివర్తనాత్మక విధానంతో గగనతలాన్ని తీర్చిదిద్దాలని భావిస్తోంది,” అని టీసీఎస్ ప్రెసిడెంట్ (మాన్యుఫాక్చరింగ్) అనుపమ్ సింఘాల్ తెలిపారు.
టీసీఎస్ ఏరోస్పేస్ నిబద్ధత
టీసీఎస్ బహుళ దశాబ్దాల అనుభవంతో ఏరోస్పేస్,డిఫెన్స్ వేల్యూ చెయిన్‌లో ఓఈఎంలు, టియర్ సరఫరాదారులు, ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్టులు, ఎంఆర్‌వోలకు మద్దతు ఇస్తూ విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోంది.
టీసీఎస్ ఏవియానా వంటి ఏకీకృత, అటానామస్, డిజిటల్, క్లౌడ్-రెడీ సొల్యూషన్‌లతో ఇంటెలిజెంట్ ఎయిర్‌లైన్ కార్యకలాపాల నిర్వహణను అందిస్తోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఎయిర్‌లైన్స్‌కు కన్సల్టింగ్ ఆధారిత ఇన్నోవేషన్, టెక్నాలజీ,ఇంజినీరింగ్ సేవలను అందిస్తూ, ఏరోస్పేస్ రంగంలో భవిష్యత్తు అవసరాలకు సన్నద్ధంగా ఉండటంలో కంపెనీలకు తోడ్పడుతోంది.