టెక్స్టైల్ రంగానికి శక్తివంతమైన శ్రామికశక్తిని సిద్ధం చేసేందుకు వెల్‌స్పన్ – NSDC భాగస్వామ్యం

వారాహి మీడియా డా కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, జూన్ 19, 2025: భారత్‌లోని భావితరపు టెక్స్‌టైల్ కార్మిక శక్తికి నైపుణ్యాభివృద్ధి చేసి, వారిని సాధికారంగా మార్చేందుకు వెల్‌స్పన్ లివింగ్

వారాహి మీడియా డా కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, జూన్ 19, 2025: భారత్‌లోని భావితరపు టెక్స్‌టైల్ కార్మిక శక్తికి నైపుణ్యాభివృద్ధి చేసి, వారిని సాధికారంగా మార్చేందుకు వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ (డబ్ల్యూఎల్ఎల్) – నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) చేతులు కలిపాయి. ఈ భాగస్వామ్యంతో, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ ప్రాంతాల నుంచి 50 శాతం మహిళలతో సహా మొత్తం 1,000 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమాన్ని కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రి జయంత్ చౌదరి, మిజోరం సీఎం పు లాల్దుహోమా కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల కీలక నాయకులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరై వెల్‌స్పన్–NSDC భాగస్వామ్యాన్ని అభినందించారు.

ఒక్కో అభ్యర్థిపై రూ.42,500 ఖర్చు

ఈ శిక్షణ కార్యక్రమానికి రూ.4.25 కోట్ల పెట్టుబడి ఉండగా, ఒక్కో అభ్యర్థిపై శిక్షణ, ప్రయాణం, స్టైపెండ్ కలిపి సుమారు రూ.42,500 ఖర్చు చేయనున్నారు. గుజరాత్‌లోని అంజార్, వాపిలో వెల్‌స్పన్ ఆధునిక శిక్షణ కేంద్రాల్లో ఇది అమలవుతుంది. 120 గంటల తరగతి గది శిక్షణతో పాటు, 210 గంటల ‘ఆన్ జాబ్ ట్రైనింగ్’ కూడా ఉంటుంది.

మహిళలపై ప్రత్యేక దృష్టి

ఈ ప్రాజెక్ట్‌లో మహిళల ప్రాతినిధ్యం 50 శాతంగా ఉండడం విశేషం. “మహిళలు భాగస్వాములు కాదు, భవిష్యత్తు టెక్స్టైల్ పరిశ్రమకు మార్గదర్శకులు” అని వెల్‌స్పన్ లివింగ్ ఎండీ & సీఈఓ దీపాలి గోయెంకా తెలిపారు. సామాజిక, ఆర్థిక సమానత్వం లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.

ఉద్యోగ అవకాశాలకూ తలుపులు

వెల్‌స్పన్ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ రాజేష్ జైన్ మాట్లాడుతూ – “ఈ శిక్షణ ఉపాధికి దోహదం చేస్తుంది. నైపుణ్యాభివృద్ధి అనేది వ్యక్తుల జీవితాల్లో మార్పును తీసుకురావడం” అని తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు వెల్‌స్పన్-NSDC ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు. తక్షణ ఉపాధికి గ్యారెంటీ కూడా ఉందని సంస్థ పేర్కొంది.

ఈ కార్యక్రమం వెల్‌స్పన్ “LITE” సిద్ధాంతం – Learning, Innovation, Trust, Endurance పై ఆధారపడి ఉందని సంస్థ వర్గాలు స్పష్టం చేశాయి.

About Author