పాజిటివ్ బజ్‌తో జూన్ 13న ZEE5 ప్రీమియర్‌కు సిద్దంగా ఉన్న ‘DD నెక్స్ట్ లెవల్’..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 13,2025: ZEE5లో హర్రర్-కామెడీ జానర్‌లో తెరకెక్కిన ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’ జూన్ 13న ప్రీమియర్ కావడానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 13,2025: ZEE5లో హర్రర్-కామెడీ జానర్‌లో తెరకెక్కిన ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’ జూన్ 13న ప్రీమియర్ కావడానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందనను దక్కించుకున్నాయి.

ఈ చిత్రంలోని కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఇప్పటికే థియేటర్లో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతిక తివారీ నటించిన ఈ చిత్రం ఇక ఇప్పుడు ZEE5లోకి రాబోతోంది. DD నెక్స్ట్ లెవల్ జూన్ 13 నుండి ZEE5లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని చూడొచ్చు.

Read This also…“DD Next Level” Generates Buzz Ahead of ZEE5 Premiere Today

https://www.instagram.com/reel/DKwNbY2SS6P

డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్ కథ అంతా కూడా సినీ విమర్శకుడు కిస్సా (సంతానం) చుట్టూ తిరుగుతుంది. అతను అసాధారణ దర్శకుడు హిచ్‌కాక్ ఇరుధయరాజ్ (సెల్వరాఘవన్) ప్రైవేట్ స్క్రీనింగ్‌లోకి రావడం, అక్కడే చిత్రంలో ఇరుక్కుపోయి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడం వంటి కామెడీ, హారర్ అంశాలతో అద్యంతం వినోద భరితంగా సాగుతుంది.

కిస్సా తనకు దొరికిన ఆధారాలను డీకోడ్ చేస్తూ బయటకు ఎలా వచ్చారన్నదే ఆసక్తికరంగా సాగుతుంది. జూన్ 13 నుండి ZEE5లో ప్రత్యేకంగా ‘DD నెక్స్ట్ లెవల్’ ప్రసారం కానుంది. అందరూ తప్పకుండా వీక్షించి ఎంజాయ్ చేయండి.

About Author