“యూనివర్సిటీ యువతకు బోయింగ్ అభినందన – బిల్డ్ పోటీలో ఏడుగురు విజేతలు”

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు, ఏప్రిల్ 29,2025: ప్రముఖ విమానయాన సంస్థ బోయింగ్ నిర్వహించిన యూనివర్సిటీ ఇన్నొవేషన్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు, ఏప్రిల్ 29,2025: ప్రముఖ విమానయాన సంస్థ బోయింగ్ నిర్వహించిన యూనివర్సిటీ ఇన్నొవేషన్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ (బిల్డ్) 2024-25 పోటీ విజేతలుగా ఏడుగురు జట్లు ఎంపికయ్యాయి. విద్యార్థులతో పాటు ప్రారంభ దశ స్టార్టప్ వ్యవస్థాపకులు పాల్గొన్న ఈ పోటీ నాలుగో ఎడిషన్‌ను బోయింగ్ భారత్ విస్తృతంగా నిర్వహించింది.

థ్రస్ట్ వర్క్స్ డైనెటిక్స్, నెక్సస్ పవర్, ఎక్స్ ట్రీవ్ ఇన్నోవేషన్స్, క్వాలివన్ టెక్నాలజీస్, రాఫా బయోనిక్స్, హైప్రిక్స్ ఏవియేషన్, త్రిశూల్ స్పేస్ అనే జట్లు విజేతలుగా నిలిచాయి. వీరి ఆవిష్కరణలకు బోయింగ్ ₹10 లక్షల గ్రాంట్‌తో పాటు టెక్నికల్, మార్కెట్ మద్దతు అందించనుంది. తద్వారా, ఈ ఆవిష్కరణలు మార్కెట్‌కు తగిన స్థాయికి అభివృద్ధి చెందనున్నాయి.

Also read this…Boeing Announces Winners of BUILD 2024-25 Innovation Program

ఇది కూడా చదవండి…అక్షయ తృతీయ రోజు చేయాల్సినవి.. చేయకూడనివి..?

ఈ కార్యక్రమం తుది దశ బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (BIETC) బెంగళూరులో నిర్వహించగా, బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తే, BIETC వైస్ ప్రెసిడెంట్ స్టాసీ సైర్, ఇతర బోయింగ్ గ్లోబల్ నేతలు, ఇంక్యూబేటర్ భాగస్వాములు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సలీల్ గుప్తే మాట్లాడుతూ – “బిల్డ్ పోటీ దేశంలోని యువత ఆశయాలను ప్రతిబింబించే వేదికగా ఎదిగింది. సాంకేతికత, వ్యాపార పరిష్కారాలను సమన్వయం చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తోంది. పాల్గొన్న విద్యార్థుల పట్ల అభినందనలు” అని అన్నారు.

బోయింగ్ ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ ఇన్క్యూబేటర్‌లతో భాగస్వామిగా ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో ఐఐటీ ముంబై-SINE, ఐఐటీ ఢిల్లీ-FIIT, ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ మద్రాస్ ఇంక్యూబేషన్ సెల్, ఐఐఎస్సీ బెంగళూరు, టి-హబ్ హైదరాబాద్, కేఐఐటీ భువనేశ్వర్-TBI ఉన్నాయి.

ఈ ఏడాది బిల్డ్‌కు దేశవ్యాప్తంగా 2,700 మంది విద్యార్థులు 2,000కి పైగా ఆవిష్కరణలతో దరఖాస్తు చేశారు. వీటిలో 75 జట్లు బూట్‌క్యాంప్‌కు ఎంపికై, ఫైనలిస్టులుగా నిలిచాయి. వారిని బోయింగ్ ఇంజనీర్లు, స్టార్టప్ నిపుణులు గైడ్ చేశారు.

ఇది కూడా చదవండి…హైదరాబాద్‌లో బిర్లా ఓపస్ పెయింట్స్‌ ఆధునిక “పెయింట్ స్టూడియో” ప్రారంభం..

బోయింగ్ BIETC వైస్ ప్రెసిడెంట్ స్టాసీ సైర్ మాట్లాడుతూ – “బిల్డ్ ద్వారా బోయింగ్ నైపుణ్యాన్ని మెంటార్ షిప్ రూపంలో యువతకు అందిస్తోంది. వారి ఆలోచనలను ఆచరణలోకి తీసుకొస్తోంది” అని వివరించారు.

ఇకపోతే, బోయింగ్ ఇండియా దేశవ్యాప్తంగా స్కిల్ డెవలప్‌మెంట్‌ను ఉద్దేశంగా పెట్టుకొని హొరైజన్ ఎక్స్ ఇండియా, నేషనల్ ఏరో మోడలింగ్ కాంపిటీషన్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అపెంటిస్‌షిప్ వంటి కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

About Author